భారీ లాభాలతో నిఫ్టి ప్రారంభం

భారీ లాభాలతో నిఫ్టి ప్రారంభం

అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్ల ఉత్సాహం కారణంగా నిఫ్టి ఇవాళ భారీ లాభాలతో మొదలైంది. రాత్రి అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు కూడా ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్నాయి. చైనా కాస్త డల్‌గా ఉన్నా.. జపాన్‌ నిక్కీ, హాంగ్‌సెంగ్‌లు లాభాలతో కొనసాగుతున్నాయి. మన మార్కెట్‌లో నిఫ్టి ఓపెనింగ్‌లోనే 10700 స్థాయిని దాటి 10752 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. అన్ని సూచీలు గ్రీన్‌లో ఉండటం విశేషం. రియాల్టి సూచీ ఒక శాతంపైగా లాభపడింది. చిన్న కంపెనీల సూచీ ఒకటిన్నర శాతం పెరిగింది. నిఫ్టి ప్రధాన షేర్లలో ఐసీఐసీఐ బ్యాంక్‌, హిందాల్కో రెండు శాతం లాభాలతో ట్రేడవుతున్నాయి. టాటా మోటార్స్‌, ఇన్ఫోసిస్‌, హిందుస్థాన్‌ లీవర్‌ లాభాల్లో ఉన్నాయి. ఇక నష్టపోయిన షేర్లలో భారతీ ఎయిర్‌టెల్‌, కోల్‌ ఇండియా, ఇన్‌ఫ్రాటెల్ షేర్లు ఉన్నా.. నష్టాలు చాలా నామమాత్రంగా ఉన్నాయి. ఇక బీఎస్‌ఇలో నిన్న 20 శాతం పెరిగిన అవంతీ ఫీడ్స్‌ ఇవాళ మరో 8 శాతం పెరిగింది.