నిలకడగా ప్రారంభమైన నిఫ్టి

నిలకడగా ప్రారంభమైన నిఫ్టి

రాత్రి అమెరికా మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ముగిసినా.. మన మార్కెట్లు నిలకడగా ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్లు మిశ్రంగా ఉన్నాయి. జపాన్‌ నిక్కీ స్వల్ప నష్టాలతో ట్రేడవుతుండగా..  చైనా మార్కెట్ల నష్టాలు అధికంగా ఉన్నాయి. హాంగ్‌సెంగ్‌ అరశాతంపైగా లాభాలతో ట్రేడవుతున్నా.. పెరుగుతున్న ముడి చమురు ధరలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయి. డాలర్‌తో రూపాయి భారీగా క్షీణించడంతో నిఫ్టిలో అమ్మకాల ఒత్తిడి పెరుగుతోంది. ఏక్షణమైనా నిఫ్టి 10500 దిగువకు వచ్చే అవకాశముంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్‌ జరుగుతున్న సమయంలో 10900 స్థాయికి చేరిన వెంటనే అమ్మకాల ఒత్తిడి కారణంగా 10,500కు చేరింది. ప్రధాన రంగాల సూచీలన్నీ రెడ్‌లో ఉన్నాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, ఓఎన్‌జీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎల్‌ అండ్‌ టీ, కోల్‌ ఇండియా ముందున్నాయి. అలాగే నష్టపోయిన నిఫ్టి షేర్లలో అల్ట్రాటెక్‌ సిమెంట్‌ ముందుంది. ఈ షేర్‌ ఒకటిన్నర శాతం నష్టపోయింది. భారతీ ఎయిల్‌టెల్‌, హీరో మోటో కార్ప్‌, హిందాల్కో, జీ ఎంటర్‌టైన్‌ మెంట్‌ కూడా ఒక శాతంపైగా నష్టపోయాయి. ఇక బీఎస్‌ఇలో జస్ట్‌ డయల్‌ 5 శాతం దాకా లాభంతో ట్రేడవుతోంది.