స్థిరంగా ప్రారంభ‌మైన నిఫ్టి

స్థిరంగా ప్రారంభ‌మైన నిఫ్టి

స్టాక్ మార్కెట్ స్థిరంగా ప్రారంభ‌మైంది. అంత‌ర్జాతీయ మార్కెట్లు స్త‌బ్దుగా ఉన్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లు ఒక మోస్త‌రు లాభాల‌తో ముగిశాయి. నాస్‌డాక్ 1.26 శాతం పెర‌గ్గా, ఇత‌ర సూచీలు ఒక మోస్త‌రు లాభాల‌తో ముగిశాయి. ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్లు గ్రీన్‌లోనే ఉన్నా లాభాలు ప‌రిమితంగా ఉన్నాయి. జ‌పాన్ నిక్కీ ఒక శాతంపైగా లాభంతో టాప్ గెయిన‌ర్‌గా ఉంది. నిన్న ముడి చ‌మురు ధ‌ర‌లు భారీగా పెరిగాయి. డాల‌ర్ ఇండెక్స్ క్షీణించినా... క్రూడ్ ప్ర‌భావంతో ఇవాళ రూపాయి 40 పైస‌లు క్షీణించింది. ఈ నేప‌థ్యంలో నిఫ్టి ఒక‌మోస్త‌రు న‌ష్టాల‌తో ప్రారంభమైంది.ప్ర‌స్తుతం 22 పాయింట్ల న‌ష్టంతో 10748 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. తొలుత అమెరికా, త‌ర‌వాత బ్రిట‌న్‌లో జేఎల్ఆర్ అమ్మ‌కాలు పుంజుకోవ‌డంతో వ‌రుస‌గా మూడో రోజు కూడా టాటా మోటార్స్ లాభాల‌తో ట్రేడ‌వుతోంది. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో టాప్ గెయిన‌ర్‌గా  స‌న్ ఫార్మా నిలిచింది. త‌ర‌వాతి స్థానాల్లో టాటా మోటార్స్‌, జేఎస్‌డ‌బ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, ఐష‌ర్ మోటార్స్ ఉన్నాయి. ఇక న‌ష్టాల్లో ఉన్న నిఫ్టి షేర్ల‌లో మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా టాప్ లూజ‌ర్‌గా నిలిచింది. త‌రువాతి స్థానాల్లో ఇన్‌ఫ్రాటెల్‌, బీపీసీఎల్‌, ఇండియా బుల్స్ హౌసింగ్‌, యాక్సిస్ బ్యాంక్ నిలిచాయి. ఇటీవ‌ల ఎన్‌బీసీసీ షేర్‌పై ఇన్వెస్ట‌ర్ల దృష్టి ప‌డింది. ఈ షేర్ ఇవాళ రెండు శాతం పెరిగింది.