11300 దాటిన నిఫ్టిః ఎన్నికల దూకుడు

11300 దాటిన నిఫ్టిః ఎన్నికల దూకుడు

రానున్న ఎన్నికల్లో మోడీ విజయం ఖాయమని సర్వేలు రావడం... రోజు రోజుకీ కాంగ్రెస్‌ బలహీనపడుతున్నట్లు వార్తలు వస్తుండటం... మార్కెట్‌లో జోష్‌ను పెంచుతోంది. అంతర్జాతీయ మార్కెట్లతో నిమిత్తం లేకుండా ర్యాలీ కొనసాగుతోంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏకంగా అయిదు శాతం పెరిగి ఆల్‌ టైమ్‌ హైని తాకగా, టైటాన్‌, యూపీఎల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కూడా ఆల్‌ టైమ్‌ హైలో ముగిశాయి. ఇవాళ నిఫ్టి 11300 స్థాయిని దాటి 11301 వద్ద 133 పాయింట్ల లాభంతో ముగిసింది. ఉదయం 11231 వద్ద ప్రారంభమైన నిఫ్టి 11227కి తగ్గినట్లు కన్పించినా.. వెంటనే రికార్డు స్థాయిలో కోలుకుంది. 11320 గరిష్ఠ స్థాయిని తాకిన నిఫ్టి చివర్లో స్వల్పంగా తగ్గి 11301 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 481 పాయింట్లు పెరిగింది. ఐటీ, పీఎస్‌యూ బ్యాంకుల సూచీలు స్వల్పంగా నష్టం పోగా రియాల్టీ సూచీ ఏకంగా 3 శాతం పెరిగింది. ప్రైవేట్‌ బ్యాంకులు పెరగడంతో బ్యాంక్‌ నిఫ్టి   కూడా 1.7 శాతం పెరిగింది. ఫార్మా, మీడియా రంగ షేర్లు కూడా రెండు శాతం దాకా పెరిగాయి. నిఫ్టిలో 30 షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి. నిఫ్టిలో లాభాల్లో ముగిసిన షేర్లలో భారతీ ఎయిర్‌టెల్‌ 5 శాతం లాభంతో టాప్‌లో ఉంది. తరవాతి స్థానాల్లో ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌, ఎల్‌ అండ్‌ టీ, అదానీ పోర్ట్స్‌ ఉన్నాయి. నిఫ్టి షే్లలో ఐషర్‌ మోటార్స్‌ మాత్రమే 2.6 శాతం నష్టపోయింది. బజాజ్‌ ఫైనాన్స్‌, ఇన్ఫ్రాటెల్‌ ఒక శాతం పైగా క్షీణించగా, హెచ్‌పీసీఎల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు నామమాత్రపు నష్టాలతో క్లోజయ్యాయి.   ఇతర షేర్లలో కాంప్ర్టన్‌ గ్రీవ్స్‌ 10 శాతం పెరిగింది.

బీఎస్‌ఈ షేర్లలో మన్‌పసంద్‌ 16 శాతం పెరగ్గా, బాంబే డైయింగ్‌,సీజీ పవర్‌ 11 శాతం పెరిగాయి. నష్టపోయినవాటిలో బజాజ్‌ కన్జ్యూమర్‌ కేర్‌ 9 శాతం క్షీణించగా, లెమన్‌ ట్రీ, స్పైస్‌ జెట్‌, నవకార్‌ కార్పొరేషన్‌, జేఎం ఫైనాన్షియల్‌ 5 శాతం పైన నష్టంతో ముగిశాయి.