స్థిరంగా ప్రారంభ‌మైన నిఫ్టి

స్థిరంగా ప్రారంభ‌మైన నిఫ్టి

నిన్న ఉద‌యం చైనా పీఎంఐ గ‌ణాంకాల‌తో మొద‌లైన ర్యాలీ ఇపుడు చ‌ల్ల‌బ‌డింది. చైనా, త‌ర‌వాత యూరో మార్కెట్లు... రాత్రి అమెరికా మార్కెట్లు భారీ లాభాల‌తో ముగిశాయి. ఎంతో కాలం నుంచి ప్ర‌తికూల వార్త‌ల‌తో బెంబేలెత్తిస్తున్న చైనా నుంచి సానుకూల డేటా రావ‌డం ఇదే మొద‌టిసారి కావ‌డం. యూరో ప్ర‌ధాన సూచీలు ఒక శాతంపైగా లాభ‌ప‌డ్డాయి. అలాగే రాత్రి అమెరికా మార్కెట్లు కూడా. ఈ నేప‌థ్యంలో ఇవాళ ఉద‌యం ఆసియా మార్కెట్లు స్థిరంగా ట్రేడ‌వుతున్నాయి. లాభ‌న‌ష్టాలు పెద్ద‌గా లేవు. ఇపుడు అంద‌రి దృష్టి బ్రెగ్జిట్‌పై. మ‌న మార్కెట్లు ఇవాళ స్థిరంగా ఓపెన‌య్యాయి. 11711 వ‌ద్ద ప్రారంభ‌మైన నిఫ్టి ఇపుడు 11660 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. ఈ మ‌ధ్య బాగా పెరిగిన మీడియా, ప్ర‌భుత్వ బ్యాంకు షేర్ల‌లో అమ్మ‌కాల ఒత్తిడి వ‌స్తోంది. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో ఐష‌ర్ మోటార్స్‌, భార‌తీ ఎయిర్‌టెల్‌, ప‌వ‌ర్ గ్రిడ్‌, ఇన్ఫోసిస్‌, మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా ఇపుడు టాప్ గెయిన‌ర్స్‌లో ఉన్నాయి. ఇక నిఫ్టి టాప్ లూజ‌ర్స్‌లో జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, అల్ట్రాటెక్ సిమెంట్‌, అదానీ పోర్ట్స్‌, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌, టాటా స్టీల్ ఉన్నాయి. ఇక బీఎస్ఈ సెన్సెక్స్‌లో గోద్రెజ్ ప్రాప‌ర్టీస్‌, ల‌క్ష్మీ విలాస్ బ్యాంక్‌, రిల‌య‌న్స్ ఇన్‌ఫ్రా, షాఫ్ల‌ర్ ఇండియా, లాల్‌ప‌త్ ల్యాబ్ ఉన్నాయి. టాప్ లూజ‌ర్స్‌లో  సియంట్ 8 శాతం క్షీణించ‌గా, ఆర్ కామ్‌, పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ హౌసింగ్‌, ఎడిల్‌వైస్‌, పీఆర్ెస్ెం జాన్స‌న్ షేర్లు ఉన్నాయి.