స్థిరంగా ప్రారంభ‌మైన నిఫ్టి

స్థిరంగా ప్రారంభ‌మైన నిఫ్టి

అంత‌ర్జాతీయ మార్కెట్లు న‌ష్టాల్లో ఉన్నా... మన మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. ఉద‌యం స్వ‌ల్ప న‌ష్టాల‌తో ప్రారంభ‌మైనా.. కొన్ని నిమిషాల్లోనే మార్కెట్ న‌ష్టాల‌ను పూడ్చుకుని లాభాల్లోకి వ‌చ్చింది. రాత్రి అమెరికా మార్కెట్లు అర‌శాతంపైగా న‌ష్ట‌పోయాయి. అలాగే ఆసియా మార్కెట్లు కూడా ఇదే స్థాయి న‌ష్టాల్లో ట్రేడ‌వుతున్నాయి. నిఫ్టి ప్ర‌స్తుతం11675 వ‌ద్ద ట్రేడ‌వుతున్నాయి. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ముడి చ‌మురు ధ‌ర‌లు పెరుగుతూనే ఉన్నాయి. ఎలాంటి ప్ర‌తికూల వార్త‌లు ఆయిల్ మార్కెట్‌పై ఒత్తిడి తేలేక‌పోతున్నాయి. భారీగా పెర‌గ‌క‌పోయినా.. త‌గ్గ‌డం మాత్రం లేదు. దీంతో అనేక కంపెనీల‌పై ప్ర‌భావం చూపుతోంది. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో సిప్లా, కోల్ ఇండియా, విప్రో, జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఓఎన్‌జీసీ షేర్లు టాప్ గెయిన‌ర్స్‌గా ఉన్నాయి.  టాప్ లూజ‌ర్స్‌లో టీసీఎస్‌, హిందాల్కో, హెచ్‌డీఎఫ్‌సీ, హీరోమోటోకార్ప్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉన్నాయి.  బీఎస్ఈ సెన్సెక్స్‌లో టాప్ గెయిన‌ర్స్ ఐనాక్స్‌, పీసీ జ్యువెల్ల‌ర్స్‌, ఇండియా బుల్స్ రియ‌ల్ ఎస్టేట్‌, శ్రీ‌రామ్ సిటీ, గోద్రోజ్ ప్రాప‌ర్టీ. టాప్ లూజ‌ర్స్‌...ఆర్ కామ్‌, కాక్స్ అండ్ కింగ్స్‌, సెంచురీ ప్లే, ల‌క్ష్మీ విలాస్ బ్యాంక్‌, స్టెర్‌లైట్ టెక్‌,