స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి

స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లు ఒక మోస్తరు లాభాలతో క్లోజ్‌ కాగా, ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. దాదాపు అన్ని ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. రాత్రి ముడి చమురు ధరలు  ఒక శాతంపైగా పెరిగాయి. ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి స్థిరంగా ఉంది. నిఫ్టి ప్రస్తుతం 11,594 వద్ద 9 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. జీ షేర్ల కారణంగా మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమలో సంక్షోభం నెలకొందని వార్తలు వస్తున్నాయి. ఈ గ్రూప్‌కు ఫండ్‌లు భారీ మొత్తంలో నిధులు రుణాలుగా ఇచ్చాయి. అవి సకాలంలో వసూలు కాకపోవడంతో ఫండ్‌లో తమ ఫిక్సెడ్‌ మంత్లీ స్కీమ్‌ల ముగింపును వాయిదా వేశాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఐఓసీ, టాటా మోటార్స్‌, బీపీసీఎల్‌, గెయిల్‌ షేర్లు టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. ఇక నష్టాల్లో ఉన్న నిఫ్టి షేర్లలో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కొటక్‌ బ్యాంక్‌, సన్‌ ఫార్మా, వేదాంత, ఇన్ఫోసిస్‌ ఉన్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ షేర్లలో ఇండియా బుల్స్‌ రిలయల్‌ ఎస్టేట్‌, ఆర్‌సీఎఫ్‌, దీపక్‌ ఫర్టిలైజర్స్‌, ఛంబల్‌ ఫర్టిలైజర్స్‌, వెల్‌స్పన్‌ కార్పొరేషన్‌ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. ఇక టాప్‌ లూజర్స్‌లో ఆర్‌ కామ్‌, జీఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఏఐఏ ఇంజనీరింగ్‌, జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ బ్యాంక్‌, వేదాంత ఉన్నాయి.