న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

అనూహ్యంగా ముడి చ‌మురు ధ‌ర‌లు రెండు శాతంపైగా పెర‌గ‌డంతో ఒక్క‌సారిగా మార్కెట్ ట్రెండ్ మారిపోయింది. ఇప్ప‌టికీ బ‌ల‌హీనంగా ఉన్న మార్కెట్ ముడి చ‌మురు ధ‌ర‌ల న్యూస్‌తో భారీగా న‌ష్ట‌పోతోంది. నిఫ్టి ఒక మోస్త‌రు న‌ష్టాల‌తో ట్రేడ‌వుతున్నా... ఇత‌ర షేర్ల‌లో భారీ అమ్మ‌కాల ఒత్తిడి వ‌స్తోంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో కూడా అమ్మ‌కాల ఒత్తిడి పెరుగుతోంది. నిఫ్టి ఇవాళ ఉద‌యం 30 పాయింట్ల న‌ష్టంతో 11727 వ‌ద్ద ప్రారంభ‌మైనా.. వెంట‌నే 11668కి ప‌డిపోయింది. ప్ర‌స్తుతం 70 పాయింట్ల న‌ష్టంతో ట్రేడ‌వుతోంది. ముడి చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌డంతో ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి బ‌క్క‌చిక్కిపోయింది. ప్ర‌స్తుతం 69.94 రూపాయల వ‌ద్ద ట్రేడ‌వుతోంది. ఒక్క ఐటీ షేర్లు మిన‌హా మిగిలిన షేర్ల సూచీల‌న్నీ న‌ష్టాల్లో ఉన్నాయి. మార్కెట్ సెష‌న్ కొన‌సాగే కొద్దీ అమ్మ‌కాల ఒత్తిడి వ‌స్తుంద‌ని స్టాక్ అన‌లిస్టులు హెచ్చ‌రిస్తున్నాయి.  11600 స్థాయికి పైన ఉన్నంత వ‌ర‌కు ఫ‌ర‌వాలేద‌ని... అక్క‌డి నుంచి ఏమాత్రం ఒత్తిడి వ‌చ్చినా భారీ ప‌త‌నం ఖాయ‌మ‌ని మ‌రికొంద‌రు అన‌లిస్ట‌లు భావిస్తున్నాయి. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో ఇన్‌ఫ్రాటెల్‌, టెక్ మ‌హీంద్రా, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్ టెక్‌, విప్రో కౌంట‌ర్లు ఉన్నాయి. అంటే నిఫ్టి ఐటీ షేర్లు కాపాడుతున్నాయి. టాప్ లూజ‌ర్స్‌లో బీపీసీఎల్‌, ఐఓసీ, ఎస్ బ్యాంక్‌, ఇండియా బుల్స్ హౌసింగ్‌, ఏషియ‌న్ పెయింట్స్ ఉన్నాయి. ఇవాళ కూడా  జెట్ ఎయిర్‌వేస్ 17 శాతం క్షీణించింది. బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయిన్స్‌... కేపీఆర్ మిల్‌, అదానీ గ్రీన్‌, సింజైన్‌, మ‌హారాష్ట్ర లైఫ్‌, పర్సిస్టెంట్ ఉన్నాయి. టాప్ లూజ‌ర్స్‌...జెట్ ఎయిర్‌వేస్‌, హెచ్‌పీసీఎల్‌, ఆర్ కామ్‌, రిల‌య‌న్స్ క్యాపిట‌ల్‌, బీపీసీఎల్‌.