న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

మార్కెట్ స్థిరంగా ప్రారంభ‌మైనా.. వెంట‌నే న‌ష్టాల్లోకి వెళ్ళింది. ప్ర‌స్తుతం 54 పాయింట్ల న‌ష్టంతో 11698 వ‌ద్ద నిఫ్టి ట్రేడ‌వుతోంది. రాత్రి అమెరికా మార్కెట్లు ఒక మోస్త‌రు లాభాల‌తో ముగిశాయి. అలాగే ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. ఇవాళ్టి నుంచి జ‌పాన్ మార్కెట్ల‌కు దాదాపు వారం రోజులు సెల‌వు. అలాగే చైనా మార్కెట్లు కూడా రేప‌టి నుంచి దాదాపు వారం రోజులు లేబ‌ర్ హాలిడే సంద‌ర్భంగా మూసేస్తారు. ముడి చ‌మురు ధ‌ర‌లు భారీగా క్షీణించినందున... ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లాభాల్లో ఉన్నాయి. ఎస్ బ్యాంక్ రేటింగ్‌ను త‌గ్గించ‌డంతో ఆ బ్యాంక్ షేర్ 30 శాతం వ‌ర‌కు క్షీణించింది. అలాగే అనిల్ అంబానీకి చెందిన కొన్ని కంపెనీలు రేటింగ్ త‌గ్గింపు కార‌ణంగా 10 శాతం దాకా న‌ష్టంతో ట్రేడ‌వుతున్నాయి. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో హెచ్‌సీఎల్ టెక్, ఐఓసీ, డాక్ట‌ర్ రె్డ్డీస్ ల్యాబ్‌, ఏషియ‌న్ పెయింట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ టాప్ గెయిన‌ర్స్‌గా ఉన్నాయి.  నిఫ్టి టాప్ లూజ‌ర్స్‌లో... ఎస్ బ్యాంక్‌, ఇండియా బుల్స్ హౌసింగ్‌, ఇండ‌స్ ఇండ్ బ్యాంక్‌, ఇన్‌ఫ్రాటెల్‌, స‌న్ ఫార్మా.

  • సెన్సెక్స్ టాప్ గెయిన్స్‌లో టాటా స్టీల్ (పీపీ), ఓరియంట్ సిమెంట్‌, బ్లూస్టార్‌, వాక్రంఘి, బిర్లా కార్పొరేష‌న్‌.
  • టాప్ లూజ‌ర్స్‌... ఎస్ బ్యాంక్‌, ఆర్ ప‌వ‌ర్‌, రిల‌య‌న్స్ క్యాపిట‌ల్‌, రిల‌య‌న్స్ ఇన్‌ఫ్రా, దీవాన్ హౌసింగ్‌