లాభాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

లాభాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

అంత‌ర్జాతీయ మార్కెట్లు నిస్తేజంగా ఉన్నా మ‌న మార్కెట్లు స్థిరంగా ప్రారంభ‌మ‌య్యాయి. ముడి చ‌మురు ధ‌ర‌లు గ‌ణ‌నీయంగా క్షీణించ‌డంతో పాటు డాలర్‌తో రూపాయి కాస్త బ‌లప‌డ‌టంతో నిఫ్టి దాదాపు క్రితం స్థాయి వ‌ద్దే ప్రారంభ‌మై.. ఇపుడు 31 పాయింట్ల లాభంతో 11756 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. రాత్రి అమెరికా మార్కెట్లు న‌ష్టాల‌తో ముగిశాయి. ముడి చ‌మురు ధ‌ర‌లు ఒక‌ద‌శ‌లో నాలుగు శాతం క్షీణించి మూడు శాతం న‌ష్టాల‌తో ముగిశాయి. ఉద‌యం నుంచి స్థిరంగా ట్రేడ‌వుతున్నాయి.చైనా, జ‌పాన్ మార్కెట్ల‌కు సెల‌వు కావ‌డంతో ఇత‌ర మార్కెట్లు నిస్తేజంగా ఉన్నాయి. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో  ఇన్‌ఫ్రాటెల్‌, బీపీసీఎల్‌, ఎస్ బ్యాంక్‌, ఓఎన్‌జీసీ, మారుతీ షేర్లు టాప్ గెయిన‌ర్స్‌గా నిలిచాయి. ఇక నిఫ్టి టాప్ లూజ‌ర్స్‌లో హెచ్‌సీఎల్ టెక్‌, టీసీఎస్‌, టెక్ మ‌హీంద్రా, ఇన్ఫోసిస్‌, బ్రిటానియా ఉన్నాయి. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్‌.... బాంబే డైయింగ్‌, ఆర్ ప‌వ‌ర్‌, టాటా స్టీల్ (పీపీ) ఆర్ కామ్‌, వీబీఎల్‌.