లాభాల‌తో ప్రారంభ‌మైన మార్కెట్‌

లాభాల‌తో ప్రారంభ‌మైన మార్కెట్‌

భారీ న‌ష్టాల త‌ర‌వాత ప్ర‌పంచ వ్యాప్తంగా మార్కెట్లు తేరుకుంటున్నాయి. రాత్రి రెండు శాతంపైగా న‌ష్ట‌పోయిన అమెరికా మార్కెట్లు...చివ‌ర్లో కోలుకుని స్వ‌ల్ప న‌ష్టాల‌తో ముగిశాయి. ఆసియా మార్కెట్లు ఉద‌యం నుంచి లాభాల్లో ట్రేడ‌వుతున్నాయి. నిన్న ఆరు శాతం దాకా ప‌డిన షేర్లు ఇవాళ ఒక శాతం వ‌ర‌కు లాబాల‌తో ట్రేడ‌వుతున్నాయి. నిన్న సెల‌వు కార‌ణంగా ప‌నిచేయ‌ని జ‌పాన్ మార్కెట్లు ఇవాళ ఒక శాతం న‌ష్టంతో ట్రేడ‌వుతున్నాయి. ఆయిల్ నిన్న పూర్తిగా న‌ష్టాల‌ను పూడ్చుకుని లాభాల్లోకి వ‌చ్చింది. ఆయిల్ ధ‌ర‌లు పెర‌గ‌డంతో ఇవాళ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. నిఫ్టి 53 పాయింట్ల లాభంతో ప్రారంభ‌మైన నిఫ్టి ఇపుడు 40 పాయింట్ల లాభంతో 11640 వ‌ద్ద ట్రేడ‌వుతున్నాయి. బ్యాంకింగ్ షేర్లు వెలుగులో ఉన్నాయి. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో బ్రిటానియా, వేదాంత‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్‌ఫ్రాటెల్‌, కోల్ ఇండియా షేర్లు టాప్ గెయిన‌ర్స్‌గా నిలిచాయి.  టాప్ లూజ‌ర్స్‌లో బీపీసీఎల్‌, ఐఓసీ, ఇండ‌స్ ఇండ్ బ్యాంక్‌, ఓఎన్‌జీసీ, యూపీఎల్ ఉన్నాయి.  

  • బీఎస్ఈ సెన్సెక్స్ లో టాప్ గెయినర్స్... మారికో, స్టెర్‌లైట్ టెక్నాల‌జీస్‌, పీసీ జ్యువ‌ల్ల‌ర్స్‌, డీబీఎల్‌, ఆర్‌కామ్‌.
  • సెన్సెక్స్ టాప్ లూజ‌ర్స్‌... సీజీ ప‌వ‌ర్‌, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఆర్ ప‌వ‌ర్‌, బీ సాఫ్ట్