న‌ష్టాల్లో ప్రారంభ‌మైన నిఫ్టి

న‌ష్టాల్లో ప్రారంభ‌మైన నిఫ్టి

అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో అమ్మ‌కాల ఒత్తిడి కొన‌సాగుతోంది. అమెరికా, చైనాల మ‌ధ్య వాణిజ్య పోరుతో ప్ర‌పంచ మార్కెట్లు అయోమ‌యంలో ప‌డ్డాయి. ఇప్ప‌టికే అధిక స్థాయిలో ట్రేడ‌వుతున్న మార్కెట్లు ఏమాత్రం చిన్న నెగిటివ్ అంశాలు వ‌చ్చినా... వెంట‌నే రియాక్ట‌వుతోంది. అమెరికా, చైనాల మ‌ధ్య వాణిజ్య చ‌ర్చ‌లు సానుల‌కూంగా జ‌రుగుతాయ‌ని మార్కెట్ వ‌ర్గాలకు తెలిసినా... ట్రంప్ వ్య‌వ‌హారం తెలిసిన పెద్ద‌లు మాత్రం రిస్క్ తీసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌టం లేదు.దీంతో అమ్మ‌కాల‌తో బ‌య‌ట‌ప‌డుతున్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లు దాదాపు రెండు శాతం వ‌ర‌కు ప‌డ్డాయంటే ప‌రిస్థితి ఎలా ఉందో చూడొచ్చు. ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్ల‌లో కూడా అమ్మ‌కాల ఒత్తిడి కొన‌సాగుతోంది. వ‌రుస‌గా మూడు రోజుల నుంచి మార్కెట్లు భారీగా క్షీణిస్తున్నాయి. ముడి చ‌మురు ధ‌ర‌లు త‌గ్గిన‌ట్లు క‌న్పిస్తున్నా...ఆసియా దేశాల‌కు సౌదీ అమ్మే బ్రెంట్ ధ‌ర మాత్రం 70 డాల‌ర్ల ప్రాంతంలో ఉంటోంది. నిఫ్టి ఇవాళ ఉద‌యం 11478 వ‌ద్ద ప్రారంభమైనా వెంట‌నే... 11428కి ప‌డిపోయింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 67 పాయింట్ల న‌ష్టంతో 11424 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. డాల‌ర్‌తో రూపాయి కూడా స్వ‌ల్పంగా క్షీణించింది.

  • నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో టాప్ గెయినర్స్‌... జేఎస్‌డ‌బ్ల్యూ స్టీల్‌, పూవ‌ర్ గ్రిడ్‌, కోల్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌.  
  • నిఫ్టి  టాప్ లూజ‌ర్స్‌... వేదాంత‌, జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, సిప్లా, ఓఎన్‌జీసీ, హిందాల్కో.
  • బీఎస్ఈ సెన్సెక్స్‌లో టాప్ గెయినర్స్‌... ఆర్ కామ్‌, ఆర్‌సీఎఫ్‌, ఐనాక్స్ లీజ‌ర్‌, జీపీపీఎల్‌, ఐఐఎఫ్ఎల్‌.  
  • సెన్సెక్స్‌లో టాప్ లూజ‌ర్స్...కాక్స్ అండ్ కింగ్స్‌, శోభా డెవ‌ల‌ప‌ర్స్‌, ఐడియా, రియ‌ల‌న్స్ క్యాపిట‌ల్‌. వేదాంత