స్థిరంగా స్టాక్ మార్కెట్లు ప్రారంభం

స్థిరంగా స్టాక్ మార్కెట్లు ప్రారంభం

అమెరికాకు చైనా గ‌ట్టిగా బ‌దులు ఇచ్చిన త‌ర‌వాత ఆసియా మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. చైనా నిర్ణ‌యంతో రాత్రి అమెరికా మార్కెట్లు భారీగా న‌ష్ట‌పోయాయి. నాస్‌డాక్ రెండున్న‌ర‌ శాతం వ‌డిపోగా, ఇత‌ర సూచీలు రెండు శాతంపై త‌గ్గాయి. ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్ల‌లో జ‌పాన్ నిక్కీ స్వ‌ల్ప న‌ష్టంతో ఉన్నా... చైనా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. మ‌న మార్కెట్లు స్థిరంగా ఓపెన‌య్యాయి. ప్ర‌స్తుతం 14 పాయింట్ల న‌ష్టంతో 11134 వ‌ద్ద నిఫ్టి ట్రేడవుతోంది. నిన్న ముడి చ‌మురు ధ‌ర‌లు రెండున్న‌ర శాతం పెరిగినా... మ‌ళ్ళీ న‌ష్టాల‌తో ముగిశాయి. డాల‌ర్‌తో రూపాయి స్థిరంగా ఉంది. నిన్న భారీ న‌ష్టాల‌తో ముగిసిన ఫార్మా షేర్లు ఇవాళ కోలుకున్నాయి. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో స‌న్ ఫార్మా, అదానీ పోర్ట్స్‌, వేదాంత, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్ బ్యాంక్ టాప్ గెయిన‌ర్స్‌గా ఉన్నాయి. ఇక న‌ష్ట‌పోయిన వాటిలో టాటా స్టీల్‌, ఓఎన్‌జీసీ, టెక్ మ‌హీంద్రా, గ్రాసిం, హెచ్‌సీఎల్ టెక్ టాప్ లూజ‌ర్స్‌లో ఉన్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్‌లో టాప్ గెయిన‌ర్స్‌.... స‌న్ ఫార్మా, ముత్తూట్ ఫైనాన్స్‌, మ‌న‌ప్పురం, వేదాంత‌, గుజ‌రాత్ గ్యాస్‌. సెన్సెక్స్ టాప్ లూజ‌ర్స్ షేర్లు... జెట్ ఎయిర్‌వేస్‌, ఎడ‌ల్‌వైస్‌, టాటా స్టీల్ (పీపీ), క‌ర్ణాట‌క బ్యాంక్‌, ఆర్ కామ్‌.