లాభాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

లాభాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

రెండో రోజూ మార్కెట్ లాభాల‌తో ప్రారంభ‌మైంది. వ‌రుస‌ భారీ  న‌ష్టాల త‌ర‌వాత రాత్రి అమెరికా మార్కెట్లు ఆక‌ర్ష‌ణీయ లాభాల‌తో ముగిశాయి. అంత క్రితం యూరో మార్కెట్లు లాభాలు పొందాయి. ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడ‌వుతున్నాయి.చైనా వాణిజ్య ఉత్ప‌త్తి గ‌ణాంకాలు నిరాశాజ‌న‌కంగా ఉన్నా... మార్కెట్లు లాభాల్లో ట్రేడ‌వుతున్నాయి.  ఫారెక్స్ మార్కెట్‌లో డాల‌ర్‌తో రూపాయి కాస్త బ‌ల‌ప‌డింది. క్రూడ్ ధ‌ర‌లు నిన్న ప‌టిష్ఠంగా ఉన్నా... ప్ర‌స్తుతానికి స్వ‌ల్ప న‌ష్టంతో ట్రేడ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో నిఫ్టి 50 పాయింట్ల లాభంతో 11271 పాయింట్ల వద్ద ప్రారంభ‌మైంది. ప్ర‌స్తుతం దాదాపు ఇదే స్థాయి వ‌ద్ద ట్రేడ‌వుతోంది. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో  యూపీఎల్‌, బీపీసీఎల్‌, ప‌వ‌ర్‌గ్రిడ్‌, అదానీ పోర్ట్స్‌, ఐఓసీ టాప్ గెయిన‌ర్స్‌గా ట్రేడ‌వుతున్నాయి.  ఇక నిఫ్టిలో టాప్ లూజ‌ర్స్‌గా ఎస్ బ్యాంక్‌, భార‌తీ ఎయిర్‌టెల్‌, జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, గ్రాసిం, స‌న్ ఫార్మా ఉన్నాయి.  

  • బీఎస్ఈ సెన్సెక్స్ షేర్ల‌లో టీటీకే ప్రిస్టేజ‌స్ ప‌ది శాతం లాభంతో ట్రేడ‌వుతోంది. టాప్ గెయిన‌ర్స్‌లో ఈ షేర్‌తో పాటు స్పైస్ జెట్‌, టాటా స్టీల్ (పీపీ), డీసీఎం శ్రీ‌రామ్‌, జ‌మ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ ఉన్నాయి.
  • సెన్సెక్స్ టాప్ లూజ‌ర్స్‌లో డెల్టా కార్పొరేష‌న్‌, యూనియ‌న్ బ్యాంక్‌, జెట్ ఎయిర్‌వేస్‌, కాక్స్ అండ్ కింగ్స్‌, ఆర్‌కామ్ ఉన్నాయి.