స్థిరంగా ప్రారంభ‌మైన మార్కెట్‌

స్థిరంగా ప్రారంభ‌మైన మార్కెట్‌

అంత‌ర్జాతీయ మార్కెట్ల‌కు అనుగుణంగా మ‌న మార్కెట్లు కూడా స్థిరంగా ట్రేడ‌వుతున్నాయి. యూర‌ప్ ఆటో కంపెనీల‌పై సుంకాలు వేస్తామ‌ని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ చేసిన ప్ర‌క‌ట‌న‌తో నిన్న యూరో మార్కెట్లు ఒక శాతం దాకా క్షీణించాయి. త‌ర‌వాత ట్రంప్ మాట మార్చ‌డంతో యూర‌ప్‌తో పాటు అమెరికా మార్కెట్లు కూడా లాభాల్లో ముగిశాయి. ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. జ‌పాన్‌తో పాటు కొన్ని  మార్కెట్లు న‌ష్టాల్లో ఉండ‌గా, చైనా, హాంగ్‌సెంగ్‌, న్యూజిల్యాండ్ వంటి మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. అయితే లాభ‌న‌ష్టాలు నామ‌మాత్రంగానే ఉన్నాయి. ముడి చ‌మురు ధ‌ర‌లు నిన్నటి మ‌ళ్ళీ పెరిగాయి. డాల‌ర్‌తో రూపాయి స్థిరంగా ఉంది. ఈ నేప‌థ్యంలో నిఫ్టి దాదాపు పాతిక పాయింట్ల లాభంతో ప్రారంభ‌మై... దాదాపు అదే స్థాయిలో ట్రేడ‌వుతోంది. నిన్న బాగా క్షీణించిన టాటా మోటార్స్ ఇవాళ టాప్ గెయిన‌ర్స్‌లో ముందుంది. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో టాటా గెయిన‌ర్స్‌... టాటా మోటార్స్‌, ఇన్‌ఫ్రాటెల్‌, జీ ఎంట‌ర్‌టైన్ మెంట్‌, ప‌వ‌ర్ గ్రిడ్‌, బ‌జాజ్ ఫైనాన్స్. టాప్ లూజ‌ర్స్‌గా నిలిచిన నిఫ్టి షేర్లు... ఇండియా బుల్స్ హౌసింగ్‌, ఐష‌ర్ మోటార్స్‌, స‌న్ ఫార్మా, సిప్లా, కొట‌క్ బ్యాంక్‌.

  • బీఎస్ఈ సెన్సెక్స్‌లో టాప్ గెయిన‌ర్స్‌...టాటా కెమిక‌ల్స్‌, టైమ్ టెక్నో, జెట్ ఎయిర్‌వేస్‌, పీఐ ఇండ‌స్ట్రీస్‌, ఎన్‌బీ వెంచ‌ర్స్‌.
  • సెన్సెక్స్ టాప్ లూజ‌ర్స్‌...లుపిన్‌, ఆర్ కామ్‌, సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండిగో, హెచ్ఎఫ్‌సీఎల్