ఆల్ టైమ్ రికార్డుకు నిఫ్టి

ఆల్ టైమ్ రికార్డుకు నిఫ్టి

ఎగ్జిట్‌పోల్ జోష్ ఇవాళ కూడా ఓపెనింగ్‌లో కొన‌సాగింది. ఓపెనింగ్‌లోనే 11863 పాయింట్ల‌ను తాకి ఆల్ టైమ్ గ‌రిష్ఠ స్థాయికి చేరింది. అక్క‌డి నుంచి 11883కి చేరి అక్క‌డి నుంచి క్షీణించ‌డం ప్రారంభించింది. ప్ర‌స్తుతం 11840 ప్రాంతంలో ట్రేడ‌వుతోంది. ప్రైవేట్ బ్యాంకుల్లో అమ్మ‌కాల ఒత్తిడి క‌న్పిస్తోంది. రాత్రి అమెరికా మార్కెట్లు ఒక మోస్త‌రు నష్టాల‌తో ముగిశాయి. హువావేపై నిషేధంతో నాస్‌డాక్ ఒక‌టిన్న‌ర శాతం క్షీణించింది.అయితే హువావేపై ఆంక్ష‌ల‌ను సడ‌లించ‌డంతో ఆసియా మార్కెట్లు గ్రీన్‌లోకి వ‌చ్చాయి. నిఫ్టి ప్ర‌ధాన షేర్లలో డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్‌ఫ్రాటెల్‌, బ‌జాజ్ ఫైనాన్స్‌, ఇండియా బుల్స్ హౌసింగ్ టాప్ గెయిన‌ర్స్‌గా ఉన్నాయి. టాప్ లూజ‌ర్స్‌గా ఉన్న షేర్లు....  టాటా మోటార్స్‌, బీపీసీఎల్‌, ఎస్ బ్యాంక్‌, గ్రాసిం, ఐష‌ర్ మోటార్స్.  బీఎస్ఈ సెన్సెక్స్‌లో టాప్ గెయిన‌ర్స్‌... జై కార్పొరేష‌న్‌, ఈడెల్ వైసెస్‌, డీబీ లిమిటెడ్‌, ఇండియా బుల్స్ లిమిటెడ్, ఓరియంట్ సిమెంట్స్‌. టాప్ లూజ‌ర్స్‌...టొరెంట్ ఫార్మా, ఆస్ట్రాల్‌, ఫిలిప్స్ కార్బ‌న్‌, టాటా మోటార్స్‌, బీ సాఫ్ట్