స్థిరంగా ట్రేడ‌వుతున్న నిఫ్టి

స్థిరంగా ట్రేడ‌వుతున్న నిఫ్టి

అంత‌ర్జాతీయ మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. ముడి చ‌మురు రాత్రి భారీగా క్షీణించింది. ఫారెక్స్ మార్కెట్‌లో డాల‌ర్‌తో రూపాయి బ‌ల‌ప‌డింది. ఈ నేప‌థ్యంలో మ‌న మార్కెట్లు స్థిరంగా ట్రేడ‌వుతున్నాయి. ఆరంభంలో నిఫ్టి కాస్త త‌డ‌బ‌డినా.. వెంట‌నే లాభాల్లోకి వ‌చ్చింది. నిఫ్టి ప్ర‌స్తుతం 11742 పాయింట్ల వ‌ద్ద 34 పాయింట్ల లాభంతో ట్రేడ‌వుతోంది. రేపు ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డుతున్నందున మార్కెట్‌లో టెన్ష‌న్ నెల‌కొంది. మెజారిటీ బ్రోక‌ర్లు ఎన్డీఏ మ‌ళ్ళీ అధికారంలోకి వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నా... ఇన్వెస్ట‌ర్లు  ముందు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో ఇన్‌ఫ్రాటెల్‌, భార‌తీ ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బీపీసీఎల్‌, అదానీ పోర్ట్స్ షేర్లు టాప్ గెయిన‌ర్స్‌గా ఉన్నాయి. నిఫ్టిలో టాప్ లూజ‌ర్స్‌... టెక్ మ‌హీంద్రా, ఇండియా బుల్స్ హౌసింగ్‌, ఎస్ బ్యాంక్‌, ఇండ‌స్ ఇండ్ బ్యాంక్‌, హిందుస్థాన్ లీవ‌ర్‌. 

  • బీఎస్ఈ సెన్సెక్స్ లో టాప్ గెయిన‌ర్స్‌... డీఎల్ఎఫ్‌, జ‌స్ట్ డ‌య‌ల్‌, సోలార్ ఇండ‌స్ట్రీస్‌, డీబీ లిమిటెడ్‌, టీఎన్ పీఎల్‌.
  • సెన్సెక్స్ టాప్ లూజ‌ర్స్‌....  దీవాన్ హౌసింగ్‌, వా బాగ్ టెక్‌, జిందాల్ స్టీల్‌, ఐఎఫ్‌సీఐ, ఆర‌తి ఇండ‌స్ట్రీస్