స్థిరంగా ప్రారంభ‌మైన మార్కెట్‌

స్థిరంగా ప్రారంభ‌మైన మార్కెట్‌

మ‌న మార్కెట్ల‌లో బుల్ జోష్ కొన‌సాగుతోంది. ఎన్నిక‌ల ఫ‌లితాల నుంచి మొద‌లైన కొనుగోళ్ళు కొన‌సాగుతున్నాయి. కొద్దిపాటి హెచ్చుత‌గ్గులు ఉన్నా... ట్రెండ్ మాత్రం ముందుకే సాగుతోంది. నిఫ్టి ఇవాళ స్థిరంగా ప్రారంభ‌మైంది. ఓపెనింగ్‌లో 30 పాయింట్ల వ‌ర‌కు పెరిగినా ఇపుడు స్థిరంగా 11900 ప్రాంతంలో  నిల‌క‌డ‌గా ట్రేడ‌వుతోంది. బ్యాంకింగ్ షేర్ల‌లో పెద్ద‌గా క‌ద‌లిక‌లు లేవు. గురువారం వ‌ర‌కు మార్కెట్ మూడ్ పాజిటివ్‌గా ఉండే అవ‌కాశ‌ముంది. డాల‌ర్‌తో రూపాయి బ‌లంగానే ఉంటోంది. ముడి చ‌మురు ధ‌ర‌లు ఇంకా దిగువ‌స్థాయిలోనే ఉన్నాయి. నిన్న అమెరికా మార్కెట్ల‌కు సెల‌వు. ఇవాళ ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో ఎస్ బ్యాంక్‌, వేదాంత‌, జేఎస్‌డ‌బ్ల్యూ స్టీల్‌, కోల్ ఇండియా,  అదానీ పోర్ట్స్ టాప్ గెయిన‌ర్స్‌గా ఉండ‌గా, టాప్ లూజ‌ర్స్‌గా ఉన్న షేర్లు... ఇన్‌ఫ్రాటెల్‌, గ్రాసిం, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్ అండ్ టీ, కొట‌క్ మ‌హీంద్రాబ్యాంక్. 

  • బీఎస్ఈ సెన్సెక్స్ షేర్ల‌లో టాప్ గెయినర్స్‌.... టైమ్ టెక్నో, ఎన్‌హెచ్‌పీసీ, ఫ్యూచ‌ర్ క‌న్జ్యూమ‌ర్‌, వెంకీస్‌, జీడీఎల్.
  • సెన్సెక్స్ టాప్ లూజ‌ర్స్‌... మ‌న్ ప‌సంద్ ఇండ‌స్ట్రీస్‌, నాట్కో ఫార్మా, ఆర్ కామ్‌, ఇన్‌ఫ్రాటెల్‌, దైనిక్ భాస్క‌ర్ లిమిటెడ్