స్థిరంగా ప్రారంభ‌మైన మార్కెట్‌

స్థిరంగా ప్రారంభ‌మైన మార్కెట్‌

రేపు మోడీ మ‌ళ్ళీ ప్ర‌ధానిగా ప‌ద‌వీ స్వీకారం చేస్తున్న నేప‌థ్యంలో స్టాక్ మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. అంత‌ర్జాతీయ మార్కెట్ల‌ను మ‌న మార్కెట్లు పెద్ద‌గా పెట్టించుకోవ‌డం లేదు. డాల‌ర్ పెర‌గ‌డం వ‌ల్ల ఐటీ షేర్ల‌కు వ‌రంగా మారింది. అలాగే ఫార్మాకు కూడా. అయితే బ్యాంకింగ్‌తోపాటు ప‌లు రంగాల షేర్ల‌లో లాభాల స్వీక‌ర‌ణ జ‌రుగుతోంది. రాత్రి అమెరికా మార్కెట్లు న‌ష్టాల్లో క్లోజ్ కాగా, ఆసియా మార్కెట్లు కూడా ఉద‌యం నుంచి న‌ష్టాల్లో ట్రేడ‌వుతున్నాయి. మే డెరివేటివ్ కాంట్రాక్ట్స్ రేప‌టితో ముగియ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో షేర్ల ధ‌ర‌ల్లో హెచ్చుత‌గ్గులు అధికంగా ఉండే అవ‌కాశ‌ముంది. అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో ముడి చ‌మురు ధ‌ర‌లు త‌గ్గుతూనే ఉండ‌టం మ‌న మార్కెట్‌కు మ‌రో అనుకూల అంశం. నిఫ్టి ప్ర‌స్తుతం 11925 ప్రాంతంలో స్థిరంగా ట్రేడ‌వుతోంది. కొన్ని పాయింట్లు క్షీణించినా మార్కెట్ వెంట‌నే కోలుకుంటోంది. నిఫ్టి రేపు కూడా అప్‌ట్రెండ్‌లో కొన‌సాగే అవ‌కాశ‌ముంది. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో గెయిల్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్ టెక్‌, ఇన్‌ఫ్రా టెల్‌, విప్రో షేర్లు టాప్ గెయిన‌ర్స్‌గా నిలిచాయి.  నిఫ్టి టాప్ లూజ‌ర్స్ షేర్ల‌లో జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఎస్‌బీఐ, హిందాల్కో, వేదాంత‌, యూపీఎల్ షేర్లు ఉన్నాయి.  

  • బీఎస్ఈ సెన్సెక్స్‌లో టాప్ గెయిన‌ర్స్‌... ఏజిస్ లాజిస్టిక్స్‌, ఫిలిప్స్ కార్బ‌న్‌, న‌వ‌కార్ కార్పొరేష‌న్‌, మెర్క్‌, వెంకీస్‌.
  • సెన్సెక్స్ టాప్ లూజ‌ర్స్‌.... మ‌న్‌ప‌సంద్ ఇండ‌స్ట్రీస్‌, 3ఎం ఇండియా, ఐటీఐ, ఈక్విటాస్‌, ఉజ్జ‌వీన్