స్థిరంగా ముగిసిన నిఫ్టి

స్థిరంగా ముగిసిన నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లు భారీగా క్షీణిస్తున్నా... మన మార్కెట్లు మాత్రం స్థిరంగా ముగిశాయి. మెక్సికో దిగుమతులపై సుంకాలు వేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించడంతో ఉదయం చైనా, ఇపుడు యూరో మార్కెట్లు భారీగా నష్టపోయాయి. యూరో మార్కెట్లు దాదాపు రెండు శాతం వరకు  నష్టంతో ట్రేడవుతున్నాయి. అయితే మన మార్కెట్లు మాత్రం స్థిరంగా ముగిశాయి. ఉదయం 54 పాయింట్ల లాభంతో 11,999 వద్ద ప్రారంభమైన మార్కెట్‌ తరవాత 12,039 పాయింట్లకు చేరింది. అయితే అధిక స్థాయిల వద్ద నిలదొక్కుకోలేక.. 11,829 పాయింట్ల కనిష్ఠ స్థాయికి చేరింది. అయితే క్లోజింగ్‌లో కాస్త కోలుకుని 23 పాయింట్ల నష్టంతో 11,922 పాయింట్ల వద్ద ముగిసింది. ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి స్థిరంగా ఉంది. నిన్న మూడు శాతంపైగా నష్టపోయిన ముడి చమురు ఇవాళ మరో రెండు శాతం క్షీణించడంతో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు, ముడి చమురు ప్రధాన ముడిపదార్థంగా వాడే ఏషియన్‌ పెయింట్స్‌, బర్జర్ పెయింట్స్‌ వంటి కంపెనీల షేర్లు భారీగా పెరిగాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఐఓసీ, ఓఎన్‌జీసీ షేర్లు టాప్‌ గెయినర్స్‌గా నిలవగా, ఎస్‌ బ్యాంక్‌, ఐటీసీ, గ్రాసిం ఇండస్ట్రీస్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లు టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి. 
ఇక బీఎస్‌ఇ సెన్సెక్స్‌ షేర్లలో బర్జర్‌ పెయింట్స్‌, పీఎన్‌బీ గిల్ట్స్‌, ఉజ్జీవన్‌, ఎడల్‌వైసిస్‌, సింఫని షేర్లు టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి.
ఇక సెన్సెక్స్‌లో టాప్‌ లూజర్స్‌గా నిలిచిన షేర్లు... ఎన్‌సీసీ, మన్‌పసంద్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫీబీమ్‌, నవకార్‌ కార్పొరేషన్‌, జైన్‌ ఇరిగేషన్‌ సిస్టమ్స్‌