లాభాల్లో ముగిసిన నిఫ్టి

లాభాల్లో ముగిసిన నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైన మార్కెట్‌... ఒకదశలో మొత్తం లాభాలను కోల్పోయింది. అయినా చివర్లో వచ్చిన కొనుగోళ్ళ మద్దతుతో నిఫ్టి క్రితం ముగింపుతో పోలిస్తే 52 పాయింట్ల లాభంతో11922 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 168 పాయింట్లు లాభపడింది. శుక్రవారం అమెరికా మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఆసియా కూడా లాభాల్లో ముగిసింది. మిడ్‌ సెషన్లో ప్రారంభమైన యూరో  కూడా ఇతర మార్కెట్ల బాటలో నడిచింది. జర్మనీ మార్కెట్లకు సెలవు.

నిఫ్టి ప్రధాన షేర్లలో బ్రిటానియా, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఇన్ఫోసిస్‌ టాప్‌ గెయినర్స్‌గా ముగిశాయి. ఇక టాప్‌ లూజర్స్‌గా ముగిసిన షేర్లలో బీపీసీఎల్‌, ఎస్‌ బ్యాంక్‌, కోల్‌ ఇండియా, గెయిల్‌, ఐఓసీ ఉన్నాయి.
బీఎస్‌ఈ సెన్సెక్స్‌ షేర్లలో టాప్‌ గెయినర్స్... దీవాన్‌ హౌసింగ్‌, మన్నపురం, అబాట్‌ ఇండియా, ముత్తూట్‌ ఫైనాన్స్‌, మదర్సన్‌ సుమి ఉన్నాయి.