న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ధోర‌ణి ప్ర‌పంచ స్టాక్ మార్కెట్ల‌ను గంద‌ర‌గోళంలో ప‌డేస్తున్నాయి. ఆయ‌న ట్వీట్స్ భ‌యాన్ని క‌ల్గిస్తున్నాయి. మెక్సికో స‌మ‌స్య స‌మ‌సిపోయింద‌ని.. సంతోషిస్తున్న స‌మ‌యంలో జీ20 భేటీకి చైనా అధ్య‌క్షుడు రాకుంటే... చైనాపై మ‌రిన్ని సుంకాలు విధిస్తామ‌ని ట్రంప్ ట్వీట్ చేశాడు. అలాగే ఫెడ‌ర‌ల్ రిజ‌ర్వ్ వ్య‌తిరేకంగా కూడా ఆయ‌న చేసిన ట్వీట్‌తో రాత్రి అమెరికా మార్కెట్లు గ్రీన్ నుంచి రెడ్‌లోకి మారాయి. ముడి చ‌మురు ధ‌ర‌లు కూడా క్షీణించాయి. ఈ నేప‌థ్యంలో ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్లు కూడా భారీ న‌ష్టాల‌తో ట్రేడ‌వుతున్నాయి. సింగ‌పూర్ ఒక్క‌టే స్థిరంగా  లాభన‌ష్టాలు లేకుండా ఉంది. మిగిలిన సూచీలు భారీ న‌ష్టాల్లో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌న మార్కెట్ స్థిరంగా ప్రారంభ‌మైనా ... వెంట‌నే న‌ష్టాల్లోకి జారుకుంది.

ప్ర‌స్తుతం నిఫ్టి 11920 ప్రాంతంలో 40 పాయింట్ల న‌ష్టంతో ట్రేడ‌వుతోంది. 11900 స్థాయి దిగువ‌కు  చేరితే నిఫ్టి 11800 స్థాయికి చేరే అవ‌కాశ‌ముంద‌ని మార్కెట్ వ‌ర్గాలు అంటున్నాయి. ఇక నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో వేదాంత‌, టాటా స్టీల్‌, గెయిల్‌, ఏషియ‌న్ పెయింట్స్‌, స‌న్ ఫార్మా షేర్లు టాప్ గెయిన‌ర్స్‌గా ఉన్నాయి. స్టీల్‌పై యాంటి డంపింగ్ నిబంధ‌న‌లు మార్చాల‌ని కేంద్రం ప్ర‌తిపాదిస్తోంది. దీంతో మెట‌ల్ షేర్ల‌లో ఆస‌క్తి వ‌చ్చింది. ఇక టాప్ లూజ‌ర్స్‌లో ఉన్న షేర్లు... ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌, ఎస్ బ్యాంక్‌, ఇన్‌ఫ్రాటెల్‌, భార‌తీ ఎయిర్‌టెల్‌, హెచ్‌సీఎల్ టెక్ ఉన్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో టాప్ గెయిన్స్‌... బీఏఎస్ఎఫ్‌, దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్‌, డెల్టా కార్పొరేష‌న్‌, మ‌ద‌ర్స‌న్ సుమి, జీఎన్ఎఫ్‌సీ షేర్లు ఉన్నాయి. సెన్సెక్స్ టాప్ లూజ‌ర్స్ లో ఉన్న షేర్లు... ఇండియా బుల్స్ లిమిటెడ్‌, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌, మ‌న్‌ప‌సంద్ ఇండ‌స్ట్రీస్‌, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్‌, ఇండియా సిమెంట్ షేర్లు ఉన్నాయి.