నష్టాలతో ప్రారంభమైన నిఫ్టి
అంతర్జాతీయంగా వృద్ధి రేటు భయాలు వెంటాడుతున్నాయి. ముడి చమురు ధరలు దారుణంగా పడిపోతున్నా...ఎక్కడా ఆశాజనక పరిస్థితి కన్పించడం లేదు. దీంతో ఏ మార్కెట్లోనైనా కాస్త పెరిగిన వెంటనే అమ్మకాల ఒత్తిడి వచ్చేస్తోంది. రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాల్లో క్లోజ్ కాగా... ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టి 38 పాయింట్ల నష్టంతో 11867 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ ఇవాళే కావడంతో మార్కెట్లో అధిక హెచ్చు తగ్గులు ఉండే అవకాశముంది.
నిఫ్టి ప్రధాన షేర్లలో బీపీసీఎల్, ఎల్ అండ్ టీ, టీసీఎస్, సిప్లా, ఏషియన్ పెయింట్స్ టాప్ గెయినర్స్‌గా ట్రేడవుతున్నాయి. ఇక నష్టాల్లో టాప్ లూజర్స్‌గా ఉన్న షేర్లు... ఎస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, వేదాంత, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్.
బీఎస్ఈ సెన్సెక్స్ లో టాప్ గెయినర్స్... మదర్సన్ సుమీ, గోద్రెజ్ ప్రాపర్టీస్, పీఎన్సీ ఇన్ఫ్రా, స్పైస్ జెట్, ఇండిగో. సెన్సెక్స్ టాప్ లూజర్స్...జెట్ ఎయిర్వేస్, ఎస్ బ్యాంక్, దీవాన్ హౌసింగ్, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్, భారత్ ఫైనాన్షియల్
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)