న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

అంత‌ర్జాతీయ మార్కెట్లు డ‌ల్‌గా ఉన్నాయి.చైనా నుంచి సానుకూల వార్త‌లు వ‌చ్చినా... మార్కెట్ నామ మాత్ర‌పు లాభాల‌తో ట్రేడ‌వుతోంది. అలాగే జ‌పాన్ నిక్కీ కూడా. హాంగ్‌సెంగ్ సూచీలో కూడా పెద్ద మార్పులు లేవు. శుక్ర‌వారం రాత్రి అమెరికా మార్కెట్లు స్వ‌ల్ప న‌ష్టాల‌తో ముగిశాయి. ఫెడ‌ర‌ల్ రిజ‌ర్వ్ భేటీ  ఉన్నందున ఇన్వెస్ట‌ర్లు జాగ్ర‌త్త ప‌డుతున్నారు. బ‌డ్జెట్ ముందు ర్యాలీ బ‌దులు..చిన్నపాటి క‌రెక్ష‌న్ ఉంటుంద‌న్న టెక్నికల్ అన‌లిస్టులు అంచ‌నాలు నిజ‌మ‌య్యేలా ఉంది. ఇవాళ ఓపెనింగ్‌లోనే నిఫ్టి 11800 స్థాయిని కోల్పోయింది. ప్ర‌స్తుతం  58 పాయింట్ల నష్టంతో 11,765 వ‌ద్ద నిఫ్టి ట్రేడ‌వుతోంది. ఐటీ షేర్లు మిన‌హా మిగిలిన షేర్ల‌లో అమ్మకాల ఒత్తిడి వ‌స్తోంది. బ్యాంకింగ్ షేర్లు బ‌ల‌హీనంగా ఉండ‌టంతో... నిఫ్టి తేరుకోలేక‌పోతోంది. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో ఎస్ బ్యాంక్‌, ఇన్‌ఫ్రాటెల్‌, ఇండియా బుల్స్ హౌసింగ్‌, విప్రో, ప‌వ‌ర్ గ్రిడ్ షేర్లు టాప్ గెయిన‌ర్స్‌గా ట్రేడ‌వుతున్నాయి. ఇక టాప్ లూజ‌ర్స్‌లో ఉన్న షేర్లు... జేఎస్‌డ‌బ్ల్యూ స్టీల్‌, వేదాంత‌, టాటా స్టీల్‌, రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్‌, గ్రాసిం ఇండ‌స్ట్రీస్ ఉన్నాయి. ఇక బీఎస్ఈ సెన్సెక్స్ ప్ర‌ధాన షేర్ల‌లో యూకో బ్యాంక్‌, క‌ల్ప‌త‌రు ప‌వ‌ర్‌, న‌వీన్ ఫ్లోరో, సీసీఎల్‌, హెక్సావేర్ టెక్నాల‌జీస్ టాప్ గెయిన‌ర్స్‌గా ట్రేడ‌వుతున్నాయి. ఇక సెన్సెక్స్ టాప్ లూజ‌ర్స్‌లో ఉన్న  షేర్లు.... జెట్ ఎయిర్‌వేస్‌, పీసీ జ్యువ‌ల్ల‌ర్స్‌, రిల‌య‌న్స్ ఇన్‌ఫ్రా, రిల‌య‌న్స్ క్యాపిట‌ల్‌, జైన్ ఇరిగేష‌న్ సిస్ట‌మ్స్ కంపెనీలు ఉన్నాయి.