భారీ లాభాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

భారీ లాభాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

ఫెడ‌ర‌ల్ రిజ‌ర్వ్ మీటింగ్‌పై ఆశ‌తో ప్ర‌పంచ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడ‌వుతున్నాయి. నిన్న యూరోపియ‌న్ మార్కెట్లు రెండు శాతం వ‌ర‌కు పెర‌గ్గా... రాత్రి అమెరికా మార్కెట్లు అదే స్థాయిలో పెరిగాయి. ఫెడ‌ర‌ల్ రిజ‌ర్వ్ ఈసారి  వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గిస్తుంద‌ని మార్కెట్ అంచనా. అలాగే అమెరికా, చైనా దేశాధ్య‌క్షుల మ‌ధ్య భేటీ పై కూడా మార్కెట్ చాలా పాజిటివ్‌గా ఉంది. ముడి చ‌మురు ధ‌ర‌లు 4 శాతం పెర‌గ‌డంతో ఎనర్జీ షేర్లు పెరిగాయి. ఆసియా మార్కెట్ల‌లో కూడా అదే ట్రెండ్ క‌న్పిస్తోంది. నిఫ్టి ఇవాళ ఉద‌యం 11744 పాయింట్ల వ‌ద్ద ప్రారంభ‌మైంది.  ఆ త‌ర‌వాత 11800 స్థాయిని దాటి ఇపుడు 11775 వ‌ద్ద ట్రేడ‌వుతోంది.

నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో టాటా స్టీల్‌, ఇండియా బుల్స్ హౌసింగ్‌, కొట‌క్ మ‌హీంద్రా, టాటా మోటార్స్‌, వేదాంత షేర్లు టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. ఇక టాప్ లూజ‌ర్స్‌గా ఉన్న షేర్లు... విప్రో, ఐఓసీ, ఇన్‌ఫ్రాటెల్‌, డాక్ట‌ర్‌రెడ్డీస్ ల్యాబ్‌, హీరో మోటోకార్ప్.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయిన్స్‌గా ఉన్న షేర్లు...  గ్రాన్యూయ‌ల్స్ ఇండియా, డీసీఎం శ్రీ‌రామ్‌, జిందాల్ స్టీల్‌, టాటా స్టీల్ పీపీ, క్యాన్ ఫిన్ హోమ్‌. సెన్సెక్స్‌లో  టాప్ లూజ‌ర్స్‌... జెట్ ఎయిర్‌వేస్‌, ఐఆర్‌బీ, జైన్ ఇరిగేష‌న్‌, జేపీ అసోసియేట్స్‌, ఐఎఫ్‌సీఐ