అదే స్థాయిలో నష్టపోయిన నిఫ్టి

అదే స్థాయిలో నష్టపోయిన నిఫ్టి

నిన్న ఏ స్థాయిలో పెరిగిందో అదే స్థాయిలో ఇవాళ క్షీణించింది నిఫ్టి. 4 పాయింట్ల నష్టంతో మొదలైన నిఫ్టికి అదే గరిష్ఠ స్థాయి. కొన్ని క్షణాల్లో నష్టాల్లోకి వెళ్ళిన నిఫ్టికి ఎక్కడా మద్దతు అందకపోవడంతో కోలుకోలేదు. మిడ్‌ సెషన్‌ తరవాత నష్టాలు అధికం కావడంతో  11,705కి క్షీణించింది. క్లోజింగ్‌లో 11,724  పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 107 పాయింట్లు నష్టపోగా, సెన్సెక్స్‌ 407 పాయింట్లు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉన్నా... మన మార్కెట్లు మాత్రం నీరసంగా ఉన్నాయి. నిన్న వీక్లీ డెరివేటివ్స్‌ సెటిల్‌మెంట్‌ కావడంతో షార్ట్‌ కవరింగ్‌తో కొన్ని షేర్లు భారీగా పెరగడంతో నిఫ్టి రికార్డు స్థాయిలో పెరిగింది. కాని ఆ లాభాలు ఇవాళ కరిగిపోయాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో యూపీఎల్‌, హిందాల్కో, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌, ఎస్‌బీఐ, టెక్‌ మహీంద్రా ఉన్నాయి. ఇక టాప్‌ లూజర్స్‌లో ఎస్‌ బ్యాంక్‌, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ, హిందుస్థాన్ లీవర్‌,  హీరో మోటోకార్ప్‌ షేర్లు ఉన్నాయి. ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో టాప్‌ గెయినర్స్‌గా నిలిచిన షేర్లు... సుజ్లాన్‌ లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌, జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ బ్యాంక్‌, హెచ్‌డీఐఎల్‌, అదాని ట్రాన్స్‌మిషన్‌ ఉన్నాయి. ఇక సెన్సెక్స్‌ టాప్‌ లూజర్స్‌గా ఉన్న షేర్లు... శోభా డెవలపర్స్‌, ఉజ్జీవన్‌, గ్రాఫైట్‌, ఈ క్లెరిక్స్‌, ఓరియంట్‌ సిమెంట్‌ ఉన్నాయి.