నష్టాలతో ముగిసిన నిఫ్టి

నష్టాలతో ముగిసిన నిఫ్టి

రోజంతా తీవ్ర ఒడుదుడుకులకు లోనైన నిఫ్టి స్వల్ప నష్టాలతో ముగిసింది. బడ్జెట్‌ ముందు ప్రి ర్యాలీ అంటూ మార్కెట్‌ వర్గాల్లో జరుగుతున్న ప్రచారానికి భిన్నంగా నిఫ్టిపై తీవ్ర అమ్మకాల ఒత్తిడి వస్తోంది. అధిక స్థాయిల్లో నిఫ్టి నిలదొక్కులేకపోయింది. అలాగే దిగువ స్థాయిలో కూడా నిఫ్టికి గట్టి మద్దతు లభించడం విశేషం. 11650 దిగువకు కచ్చితంగా ఇవాళ నిఫ్టి క్షీణిస్తుందని టెక్నికల్‌ అనలిస్టులు అంచనా వేయగా... క్లోజింగ్‌లో నిఫ్టి 24 పాయింట్ల నష్టంతో 11699 వద్ద ముగిసింది. ఉదయం 11725 వద్ద మొదలైన నిఫ్టి తరవాత 11754ని తాకింది. వెంటనే వచ్చిన అమ్మకాల ఒత్తిడి కారణంగా క్షీణిస్తూ వచ్చింది. ఒకదశలో 11,670 స్థాయికి క్షీణించిన నిఫ్టి 11650 దిగువకు వెళుతుందేమోనని అనిపించింది. అయితే  అదే స్థాయిలో మద్దతు అందడంతో కోలుకుంది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి.  మిడ్‌ సెషన్‌లో మొదలైన యూరో మార్కెట్లు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి.

నిఫ్టి ప్రధాన షేర్లలో యూపీఎల్‌, ఎస్‌ బ్యాంక్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టీసీఎస్‌, ఎస్‌బీఐ షేర్లు టాప్‌ గెయినర్స్‌గా ముగిశాయి. టాప్‌ లూజర్స్‌గా ముగిసిన షేర్లు... జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఐషర్‌ మోటార్స్‌, ఓఎన్‌జీసీ, టాటా స్టీల్‌, బజాజ్‌ ఆటో.
ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ప్రధాన షేర్లలో జైన్‌ ఇరిగేషన్‌, హెచ్‌డీఐఎల్‌, సుజ్లాన్‌, లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌, ఏపీఎల్‌ లిమిటెడ్‌ టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. సెన్సెక్స్‌ ప్రధాన షేర్లలో టాప్‌ లూజర్స్‌...  కాక్స్ అండ్‌ కింగ్స్‌, ఆర్‌ పవర్, గ్లెన్‌మార్క్‌, ఇమామీ, జేపీ అసోసియేట్స్‌.