భారీ లాభాలతో ముగిసిన నిఫ్టి

భారీ లాభాలతో ముగిసిన నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా మన మార్కెట్లు కూడా భారీగా పెరిగాయి. ముఖ్యంగా మెటల్స్‌తో ర్యాలీ ప్రారంభమైనా.. మార్కెట్‌ను ప్రైవేట్‌ బ్యాంకులు, రియాల్టి, ఫైనాన్షియల్స్‌ నిఫ్టిని ముందుకు తీసుకెళ్ళాయి. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 77 పాయింట్ల లాభంతో 11865 పాయింట్ల వద్ద ముగిసింది. అంతక్రితం 11884స్థాయిని కూడా తాకింది. ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి బలపడినా.. తరవాత క్రితం స్థాయికి వచ్చేసింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. అయినా.. మార్కెట్‌  లాభాల్లో ముగియడం విశేషం. ఐటీ, మెటల్స్‌ సూచీలు మాత్రమే నష్టాల్లో ముగిశాయి. వాణిజ్య చర్చలు జరపాలన్న అమెరికా, చైనా అధ్యక్షుల నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్‌ ర్యాలీకి దారి తీసింది. నిఫ్టి ప్రధాన షేర్లలో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవాళ టాప్‌ గెయినర్‌గా మారింది. ఈ షేర్‌తో పాటు డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, బజాజ్‌ ఆటో, టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ  షేర్లు టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. ఇక టాప్‌ లూజర్స్‌గా నిలిచిన షేర్లలో బీపీసీఎల్‌, ఓఎన్‌జీసీ, ఐఓసీ, కోల్‌ ఇండియా, హెచ్‌సీఎల్‌ టెక్‌ ఉన్నాయి. ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్‌ షేర్లలో  అదానీ పవర్, వాబాగ్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, రిలాక్సో షేర్లు టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. ఇక టాప్‌ లూజర్స్‌గా నిలిచిన షేర్లు... థామస్‌ కుక్‌, సోలార్‌ ఇండస్ట్రీస్‌, జైన్‌ ఇరిగేషన్‌, కాక్స్‌ అండ్‌ కింగ్స్‌, ఇండియా బుల్స్‌ లిమిటెడ్‌.