స్థిరంగా ప్రారంభ‌మైన మార్కెట్లు

స్థిరంగా ప్రారంభ‌మైన మార్కెట్లు

ఎల్లుండి కేంద్ర బ‌డ్జెట్ రానున్న నేప‌థ్యంలో షేర్‌ మార్కెట్  నిల‌క‌డ‌గా ట్రేడ‌వుతోంది. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ముడి చ‌మురు ధ‌ర‌లు ఏకంగా 4 డాల‌ర్లు క్షీణించ‌డంతో పాటు ఫారెక్స్ మార్కెట్‌లో డాల‌ర్‌తో రూపాయి బ‌లంగా ఉండ‌టంతో మార్కెట్ స్థిరంగా ఉంది. బ‌డ్జెట్‌పై అనేక ఆశ‌లు పెట్టుకున్న మార్కెట్‌లో రేపు వీక్లీ డెరివేటివ్ క్లోజింగ్ కూడా ఉంది. ఈ నేప‌థ్యంలో బ్యాంకు షేర్లపై ఒత్తిడి పెరుగుతోంది. రాత్రి  అమెరికా మార్కెట్ స్వ‌ల్ప లాభాల‌కే ప‌రిమిత‌మైంది. ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్ల‌లో అమ్మ‌కాలు కొన‌సాగుతున్నాయి. జ‌పాన్‌, చైనా, హాంగ్ సెంగ్ సూచీల‌న్నీ న‌ష్టాల్లో ఉన్నాయి. నిఫ్టి ప్ర‌స్తుతం 11920 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే కేవ‌లం ప‌ది పాయింట్ల లాభంతో నిఫ్టి ట్రేడ‌వుతోంది.

నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో ఎస్ బ్యాంక్‌, ఇండ‌స్ ఇండ్ బ్యాంక్‌, జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఏషియ‌న్ పెయింట్స్‌, ఇండియా బుల్స్ హౌసింగ్ షేర్లు టాప్ గెయిన‌ర్స్‌గా నిలిచాయి.  ఇక టాప్ లూజ‌ర్స్‌గా ఉన్న షేర్లు... డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్‌, వేదాంత‌, ఓఎన్‌జీసీ, హిందాల్కో, గెయిల్. 
బీఎస్ఈ సెన్సెక్స్ షేర్ల‌లో టాప్ గెయిన‌ర్స్‌... దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్, అదానీ గ్రీన్‌, మ‌న్‌ప‌సంద్‌, ఛంబ‌ల్ ఫ‌ర్టిలైజ‌ర్స్‌, ఆర్ కామ్‌. సెన్సెక్స్ షేర్ల‌లో టాప్ లూజ‌ర్స్‌... కాక్స్ అండ్ కింగ్స్‌, ఆరో ఫార్మా, సుజ్లాన్‌, గ్రాఫైట్‌, దైనిక్ భాస్క‌ర్