లాభాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

లాభాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

మే సిరీస్ ఆక‌ర్ష‌ణీయంగా ప్రారంభమైంది. ప్ర‌పంచ  మార్కెట్లు న‌ష్టాల్లో ఉన్నా మ‌న మార్కెట్లు మాత్రం స్వ‌ల్ప లాభంతో ప్రారంభ‌మ‌య్యాయి. రాత్రి అమెరికా మార్కెట్ల‌లో నాస్‌డాక్ మిన‌హా మిగిలిన సూచీలు న‌ష్టాల్లో ముగిశాయి. అలాగే ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్లు న‌ష్టాల్లో ట్రేడ‌వుతున్నాయి ఒక్క హాంగ్‌సెంగ్ త‌ప్ప‌. హాంగ్‌సెంగ్ కూడా చాలా స్వ‌ల్ప లాభంతో ట్రేడ‌వుతోంది. ముడి చ‌మురు ధ‌ర‌లు ఒక శాతం  వ‌ర‌కు త‌గ్గినా...  ఆ మేర‌కు డాల‌ర్‌తో రూపాయి  క్షీణించ‌డంతో  ప్ర‌యోజ‌నం లేకుండా పోతోంది. ఈ నేప‌థ్య్ంలో  నిఫ్టి 11683 వ‌ద్ద ప్రారంభ‌మై.. అదే స్థాయిలో కొన‌సాగుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 35 పాయింట్ల లాభంతో నిఫ్టి ట్రేడ‌వుతోంది. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో టాటా స్టీల్‌, ఐఓసీ, ఇన్‌ఫ్రాటెల్‌, యాక్సిస్ బ్యాంక్‌, బీసీసీఎల్ టాప్ గెయిన‌ర్స్‌గా ఉన్నాయి. వీటిల్లో చాలా వ‌ర‌కు షేర్లు ఫ‌లితాలు బాగుండ‌టంతో పెరిగిన‌వి కావ‌డం విశేషం. అలాగే ముడి చ‌మురు ధ‌ర‌లు త‌గ్గ‌డం వ‌ల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు కూడా లాభాల‌తో ఉన్నాయి. ఇక న‌ష్టాల్లో ఉన్న నిఫ్టి షేర్ల‌లో  టాటా మోటార్స్‌, మారుతీ, హీరో మోటార్స్‌, ఇండ‌స్ ఇండ్ బ్యాంక్‌, కొట‌క్ మ‌హీంద్రా బ్యాంక్ ఉన్నాయి. 

బీఎస్ఈ టాప్ గెయిన‌ర్స్‌... టాటా స్టీల్ (పీపీ), జ‌మ్మూ అండ్ కాశ్మీర్‌, జీహెచ్‌పీఎల్‌, సియంట్‌, టాటా స్టీల్‌.

టాప్ లూజ‌ర్స్‌.... ర్యాలీస్ ఇండియా, 3ఎం ఇండియా, టాటా మోటార్స్‌, టాటా మోటార్స్ డీవీఆర్‌, మ‌ద‌ర్స‌న్ సుమి