ఫిఫా: ఐస్‌ల్యాండ్‌పై నైజీరియా విజయం

ఫిఫా: ఐస్‌ల్యాండ్‌పై నైజీరియా విజయం

ఫిఫా ప్రపంచకప్‌లో నైజీరియా బోణీ కొట్టింది. ఆరంభ మ్యాచ్‌లో క్రోయేషియా చేతిలో ఓడిన ఈ జట్టు  ఐస్‌లాండ్‌ని 2-0తో చిత్తుగా ఓడించి గ్రూప్‌-డిలో రెండో స్థానానికి చేరుకుంది. మ్యాచ్‌ ప్రారంభం నుంచి నైజీరియా ఆటగాళ్లు ఆధిపత్యాన్ని కనబరిచారు. కౌంటర్ అటాకింగ్‌తో ఐస్‌లాండ్‌కు గోల్‌ చేసేందుకు అవకాశం ఇవ్వలేదు. రెండో సెషన్‌లో అహ్మద్ ముసా(49వ, 75వ నిమిషంలో) రెండు గోల్స్ కొట్టి నైజీరియాకు ఆధిక్యతనిచ్చాడు. ఈ గెలుపుతో గ్రూప్-డిలో నాకౌట్‌ సమరం ఆసక్తికరంగా మారింది.