బిగ్ బ్రేకింగ్ : తెలంగాణాలో ఇవాళ్టి నుంచి రాత్రి కర్ఫ్యూ

బిగ్ బ్రేకింగ్ : తెలంగాణాలో ఇవాళ్టి నుంచి రాత్రి కర్ఫ్యూ

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ రోజు రాత్రి నుండి  నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉండనున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం.  నేటి నుంచి మే 1 వరకు కర్ఫ్యూ కొనసాగునుంది.  అత్యవసర సర్వీసులకు నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయింపులు ఇస్తూ  తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ కర్ఫ్యూ నుంచి మీడియా, పెట్రోల్ బంకులు, ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసులు, ఈ-కామర్స్ సర్వీసులు,  మెడికల్ షాపులకు  మినహాయింపులు ఇచ్చింది ప్రభుత్వం. ఇక  నైట్ కర్ఫ్యూ కారణంగా బార్లు, క్లబ్బులు, వైన్స్, షాపింగ్ మాల్స్ రాత్రి పూట మూతపడనున్నాయి. కాగా తెలంగాణలో సెకండ్ వేవ్ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. రోజువారీ కేసులు 4 వేలకు పైగా నమోదవుతున్నాయి.  రాష్ట్రంలో కొత్తగా 5926 కేసులు నమోదయ్యాయి.  దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,61, 359కి చేరింది. ఇందులో 3,16,650 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 42,853 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక తెలంగాణలో కొత్తగా 18 మంది కరోనాతో మృతి చెందారు.  దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1856కి చేరింది.