రాజస్థాన్‌పై నైట్‌రైడర్స్‌ ఘన విజయం 

రాజస్థాన్‌పై నైట్‌రైడర్స్‌ ఘన విజయం 

రాజస్థాన్‌ దక్కిన అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకుంది. గెలిచే స్థితిలో ఉన్నా.. అకాశాన్ని ఉపయోగించుకోలేక ఈ జట్టు ఐపీఎల్‌-11 నుంచి నిష్క్రమించింది. తమ బ్యాట్ తో బంతులకే చుక్కులు చూపుతూ ఎదురొడ్డి పోరాడి ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా తట్టుకొని నిలిచి.. ఎలిమినేటర్‌లో కోల్‌కతా అద్భుతంగా పుంజుకుంది. దినేశ్‌ కార్తీక్‌, రసెల్‌, కుల్‌దీప్‌, చావ్లా రాణించడంతో రాజస్థాన్‌ను ఓడించి సన్‌రైజర్స్‌తో శుక్రవారం జరగనున్న క్వాలిఫయర్‌-2కు అర్హతను సాధించింది. ఆ మ్యాచ్‌లో విజయాన్ని అందుకున్న జట్టు ఫైనల్లో ఆదివారం చెన్నైని ఢీకొంటుంది. 

కోల్‌కతా జట్టు తన పోరాటంతో ఐపీఎల్‌-11లో ముందంజలో నిలిచింది. బుధవారం జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌పై గెలిచింది. మొదట కోల్‌కతా 7 వికెట్లకు 169 పరుగులు సాధించింది. ఆ తర్వాత రాజస్థాన్ తడబాటుతో ఆడి 4 వికెట్లకు 144 పరుగులే చేయగలిగింది. కాగా ఈ మ్యాచ్ లో రసెల్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది.