వైరల్ అవుతున్న నిహారిక పోస్ట్

వైరల్ అవుతున్న నిహారిక పోస్ట్

మెగాడాటర్ నిహారికా ఇటీవల వివాహం చేసుకొని అత్తారింటికి వెళ్లిన సంగతి తెలిసిందే. పెళ్లి అయినంత మాత్రాన నిహారిక తన నటనా జీవితానికి దూరం అవ్వలేదు. అడపాతడపా షూటింగ్‌లతో నిహారికా బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల ఓ షూటింగ్‌లో పాల్గొన్న నిహారికకు చిత్రీకరణ సమయంలో కాలుకి దెబ్బతగిలింది. వెంటనే ఆసుపత్రికి వెళ్లడంతో డాక్టర్లు చికిత్స చేసి కట్టు కట్టారు. అప్పటి నుంచి నిహారికా ఇంటికే పరిమితం అయ్యారు. అయితే తాజాగా నిహారికా ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. అందులో చైతన్య నిహారిక కాలు కనిపించేలా ఓ ఫోటోను క్లిక్ మనిపించారు. ఆ ఫోటో కింద ‘మీరు మూడు కోరికలు కోరుకోవచ్చని జీనీ అడిగినట్లు, వాటికి తాను మూడు కోరికలుగా నిహారికా త్వరగా కోలుకోవాల’ని కోరుతున్నట్లు రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నవ దంపతులు మధ్య ఉన్న ప్రేమకు మెగా అభిమానులు ఫిదా అవుతున్నారు.