డేటింగ్ చేయాల్సి వస్తే... !!!

డేటింగ్ చేయాల్సి వస్తే... !!!

నిహారిక హీరోయిన్ గా చేస్తున్న సూర్యకాంతం సినిమా మార్చి 29 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమా ప్రమోషన్స్ ను నిహారిక ప్రారంభించింది.  ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నది.  ఇందులో భాగంగానే నిహారికను ఫ్యాన్స్ కొన్ని ప్రశ్నలు వేశారు.  ఆ ప్రశ్నలకు నిహారిక చాలా తెలివిగా సమాధానం చెప్పింది.  

ప్రేమకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్ లు నచ్చవని చెప్పింది.  డీజేగా మారితే డీజే కిల్లర్ అనే పేరుతో పాపులర్ అవుతా అంటోంది నిహారిక.  గతంలో ఓసారి రెండు రోజులపాటు స్నానం చేయకుండా ఉన్నానని చెప్పిన నిహారిక, ఎమోషన్స్ సంబంధించిన పదాలు వాడేసమయంలో ఫసక్ అనే పదాన్ని వాడొచ్చని చెప్తోంది.  అంతేకాదు డేట్ చేయాల్సి వస్తే.. ఓపికగా వినే వ్యక్తిని ఎంచుకుంటానని చెప్తోంది.  ఎందుకంటే తాను ఎక్కువగా మాట్లాడతానని చిలిపిగా సమాధానం చెప్పింది.  సూర్యకాంతం పాత్రలాగే తనది స్వార్ధస్వభావం కలిగిన లక్షణాలు ఉన్న అమ్మయినని అంటోంది.  క్యారెక్టరైజేషన్ పరంగా మంచి మార్కులు కొట్టేసిన సూర్యకాంతం సినిమా రిలీజ్ తరువాత ఎలా ఉంటుందో చూడాలి.