పైరసీయే కాదు, ఉగ్రవాదులు కూడా వాడేస్తున్నారు! ఆ యాప్‌ని బ్యాన్ చేయండి...

పైరసీయే కాదు, ఉగ్రవాదులు కూడా వాడేస్తున్నారు! ఆ యాప్‌ని బ్యాన్ చేయండి...

అర్జున్ సురవరం సక్సెస్ జోష్‌లో ఉన్న హీరో నిఖిల్ కి షాక్ ఎదురైంది. అర్జున్ సురవరం సక్సెస్ మీట్ జరుపుకొని గుంటూరు నుండి బయలుదేరిన నిఖిల్.. రోడ్ మీదే తన సినిమా పైరసీ సీడీని 40 రూపాయలకే అమ్మటాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. పైరసీ అమ్మే మహిళపై తన ఆవేదన చూపలేక.. ప్రేక్షకులకి పైరసీని ఎంకరేజ్ చేయవద్దని ఓ వీడియో ద్వారా విజ్ఞప్తి చేసారు. ఇది ఇలా ఉండగా ఆ వీడియోపై స్పందించిన ఓ అభిమాని పైరసీ సీడీని కనీసం 40 రూపాయలకైనా కొంటున్నారు...  కానీ, టెలిగ్రామ్‌ యాప్‌లో ఫ్రీగా పైరసీ లింక్ పోస్ట్ చేస్తున్నారని నిఖిల్ దృష్టికి తీసుకొచ్చాడు. దీనిపై స్పందించిన నిఖిల్.. ప్రభుత్వం ఈ టెలిగ్రామ్ యాప్ ని బ్యాన్ చేయాలని, ఉగ్రవాదులు కూడా ఈ యాప్ ని వాడుకుంటున్నారని విజ్ఞప్తి చేశారు.