నిఖిల్ సమస్య తీరింది !

నిఖిల్ సమస్య తీరింది !

హీరో నిఖిల్, దర్శకుడు సంతోష్ కలిసి ఒక చిత్రాన్ని చేస్తున్నారు.  ఏ చిత్రానికి మొదట్లో 'ముద్ర' అనే టైటిల్ పెట్టారు.  కానీ ఇదే పేరుతో ఈమధ్య జగపతిబాబు ప్రధాన పాత్రలో రూపొందిన ఒక సినిమా విడుదలైంది.  రెండు సినిమాల టైటిల్స్ ఒకేలా ఉండటంతో ఆ చిత్ర నిర్మాత, నిఖిల్ మధ్య వివాదాలు చెలరేగాయి.  

దీంతో నిఖిల్ అండ్ టీమ్ తమ సినిమాకు టైటిల్ మార్చాలని నిర్ణయించుకున్నారు.  అన్నీ ఆలోచించి సినిమాలో నిఖిల్ పాత్ర పేరైన అర్జున్ సురవరంను టైటిల్ గా నిర్ణయించారు.  దీంతో సినిమాకు టైటిల్ సమస్య తీరిపోయింది.  ఈ చిత్రంలో నిఖిల్ ఒక జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నాడు.  అతనికి జోడీగా లావణ్య త్రిపాఠి నటిస్తోంది.