'సీబీఐ అంటే మాకేం భయం లేదు..'

'సీబీఐ అంటే మాకేం భయం లేదు..'

సీబీఐ, ఏపీ పరిధిలోని కేసులపై దర్యాప్తు చేపట్టాలన్నా, అవినీతిపై చర్యలు తీసుకోవాలన్నా  ఏపీ ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే అన్న నిర్ణయానికి దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోందని ఏపీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ సీబీఐకి అనుమతి నిరాకరించింది ఎవరికీ భయపడి కాదని చెప్పారు. ఒక్క ఏపీయేనే కాదు దేశంలో చాలా రాష్ట్రాలు సమ్మతి ఇవ్వలేదని ఆయన గుర్తుచేశారు. సీబీఐకి భయపడటానికి చంద్రబాబు తప్పులేమీ చేయలేదన్న చినరాజప్ప.. కేంద్రం రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటోందని ఆరోపించారు.