వైఎస్ వివేక హత్యపై హోంమంత్రి చినరాజప్ప..

వైఎస్ వివేక హత్యపై హోంమంత్రి చినరాజప్ప..

వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన చర్చకు దారితీసింది. గుండెపోటుతో మరణించారని భావించినా... పోస్ట్‌మార్టం నివేదిక హత్యగా తేల్చింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు దీనిపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ (సిట్‌)ను కూడా ఏర్పాటు చేసింది సర్కార్. ఇక వైఎస్ వివేకా హత్యపై స్పందించిన ఏపీ హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చాలా బాధాకరమైన విషయం అన్నారు. ప్రత్యేక పోలీసు బృందాన్ని విచారణకు ఆదేశించామన్న ఆయన.. పోలీసు విచారణ తర్వాత నిజానిజాలు బయటపడతాయన్నారు. వివేక హత్య కేసులో తెలుగుదేశం నాయకుల మీద ఆరోపణలు చేయడం సరికాదన్న చినరాజప్ప.. ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరుపుతున్నారని స్పష్టం చేశారు.