మరోసారి నీరవ్ మోడీ బెయిల్ తిరస్కరణ

మరోసారి నీరవ్ మోడీ బెయిల్ తిరస్కరణ

పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో కీలక నిందితుడు నీరవ్ మోడీకి లండన్ కోర్టులో మరోసారి చుక్కెదురైంది. బెయిల్ కోరుతూ దాఖలు చేసిన మూడో పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టులో శుక్రవారం విచారణ సందర్భంగా.. నీరవ్ దేశం విడిచి పోయే అవకాశం ఉందని, సాక్ష్యాలు తారుమారు చేస్తాడని.. బెయిల్ ఇవ్వొద్దని భారత్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే తాను దేశం విడిచిపోనని.. భారత్‌లో కేసు నమోదు కాకముందు నుంచి తాను ఇక్కడ ఉంటున్నానని.. అలాంటిది తాను దేశం విడిచిపోతాననే కారణంతో బెయిల్ ఎందుకు నిరాకరిస్తున్నారని ప్రశ్నించారు. మార్చి 19న నీరవ్ మోడీని లండన్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.