నిర్భయ దోషులను ఉరి తీసేది ఎప్పుడంటే...?

నిర్భయ దోషులను ఉరి తీసేది ఎప్పుడంటే...?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులకు క్షమాభిక్ష పెట్టేందుకు తిరస్కరించారు రాష్ట్రపతి.. దీంతో దోషులను ఉరితీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న దోషులను అక్కడే ఉరితీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై జాతీయ మీడియాలో రకరాల కథనాలు వస్తున్నాయి.. వాటి ప్రకారం డిసెంబర్‌లోనే ఉరి తీస్తారని పేర్కొంటున్నాయి. మరోవైపు డిసెంబర్ ఈ కేసులో దోషులుగా తేలిన నలుగురిని ఈ నెల 16వ తేదీన ఉదయం 5 గంటలకు ఉరితీస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. మరోవైపు ఈ కేసులో.. అనుకోకుండా.. ఓ ట్విస్ట్ అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. వినయ్‌ శర్మ అనే వ్యక్తి పేరిట.. ఓ క్షమాపణ పత్రం.. గవర్నర్ వద్దకు అలాగే.. రాష్ట్రపతి వద్దకు వెళ్లింది. అయితే.. ఆ లెటర్‌తో నాకు సంబంధం లేదని తాను క్షమాభిక్ష కోసం ఎలాంటి దరఖాస్తు చేసుకోలేదని దోషి చెప్పడం గమనార్హం.