ప్రత్యేక హోదాపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

ప్రత్యేక హోదాపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

ఏపీతోపాటు పలు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇకనపై ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వబోమని స్పష్టం చేసింది. లోకసభలో బీహార్ ఎంపీ కౌసలేంద్ర కుమార్ ఇవాళ ప్రత్యేక హోదాపై ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. 

ఏపీ, తెలంగాణ, బీహార్‌, జార్ఖండ్‌, చత్తీస్‌గఢ్‌, ఒడిశా, రాజస్థాన్‌లు ప్రత్యేకహోదా కోసం విజ్ఞప్తి చేశాయని వెల్లడించిన నిర్మల.. ప్రణాళికా మద్దతు కోసమే ప్రత్యేక హోదా ఇవ్వాలని జాతీయాభివృద్ది మండలి సిఫారసు చేసిందని చెప్పారు. పారిశ్రామిక రాయితీలతో సంబంధం లేదని తేల్చి చెప్పారు.