ధీరూ భాయ్ అంబానీ స్క్వేర్ ప్రారంభం

ధీరూ భాయ్ అంబానీ స్క్వేర్ ప్రారంభం

ముంబయిలో 20 మిలియన్ల నగర ప్రజల కోసం నిర్మించిన 'ధీరూభాయ్ అంబానీ స్క్వేర్’ను రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారతదేశ ముద్దుబిడ్డ ధీరూభాయ్ అంబానీ దూరదృష్టి ఫలితమే ధీరుభాయ్ అంబానీ స్క్వేర్, జియోవరల్డ్ సెంటర్‌ అని అభిప్రాయపడ్డారు. ఈ అద్భుతమైన ఫౌంటెయిన్ అందరి హృదయాంతరాల్లో సంతోషాన్ని, విశ్వాసాన్ని నింపుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ మ్యూజికల్ ఫౌంటెయిన్ ముంబై వాసులకు మరింత ఆహ్లాదాన్ని కలిగిస్తుందన్నారు. జియో వరల్డ్ సెంటర్‌లోని ఈ స్క్వేర్ భవిష్యత్ ముఖచిత్రాన్ని మార్చేలా సందర్శకుల ఆదరణ పొందుతుందన్నారు. సమాజంలో మంచి మార్పులు తీసుకొచ్చేందుకు రిలయన్స్ ఫౌండేషన్ తన కార్యక్రమాలను కొనసాగిస్తుందని నీతా అంబానీ స్పష్టం చేశారు