నితిన్ నిశ్చితార్ధానికి ముహూర్తం ఫిక్స్... 

నితిన్ నిశ్చితార్ధానికి ముహూర్తం ఫిక్స్... 

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ లో ఒకరైన నితిన్ నిశ్చితార్ధం రేపు హైదరాబాద్ లో జరగబోతున్నట్టు తెలుస్తోంది.  కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరగబోతున్నట్టు సమాచారం.  గత కొంతకాలంగా నితిన్  ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు.  ఆ అమ్మాయి పేరే షాలిని.  లండన్ లో చదువుతున్న సమయంలో అమ్మాయి ప్రేమలో పడిపోయాడట.  

ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పడం, వారు కూడా ఒప్పుకోవడంతో పెళ్ళితంతు మొదలుపెట్టబోతున్నట్టు తెలుస్తోంది.  ప్రస్తుతం నితిన్ భీష్మ సినిమా చేస్తున్నారు.  త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కాబోతున్నది.  ఈరోజు రిలీజైన సింగిల్ సాంగ్ తో అంచనాలు పెరిగాయి.  రష్మిక మందన్న హీరోయిన్.  వెంకీ ఈ సినిమాను క్యూట్ లవ్ స్టోరీగా తీర్చి దిద్దారని సమాచారం. సినిమాలో ప్రేమను సక్సెస్ చేసుకున్నటుగానే నిజజీవితంలో కూడా నితిన్ తన ప్రేమను సక్సెస్ చేసుకోవడం విశేషం.