ఈ కళ్యాణం నితిన్ ఫేట్ ను మారుస్తుందా ?

ఈ కళ్యాణం నితిన్ ఫేట్ ను మారుస్తుందా ?

దాదాపు 10 ఫ్లాపుల తర్వాత 'ఇష్క్, గుండెజారి గల్లతయ్యిందే, అ..ఆ' వంటి విజయాలతో గాడిలో పడిన హీరో నితిన్ మరోసారి పాత కష్టాల్లో ఇరుక్కున్నారు.  ఎన్నో ఆశలు పెట్టుకుని ఆయన చేసిన 'లై' సినిమా భారీ పరాజయాన్ని చవిచూడగా ఇటీవల ఆయన చేసిన మరొక ప్రయత్నం 'ఛల్ మోహన్ రంగ' కూడ డిజాస్టర్ గా నిలిచింది.  దీంతో ఆయన కెరీర్ మరోసారి ఇబ్బందుల్లో పడింది.  

ఈ గడ్డు కాలం నుండి తప్పించుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఆయన నిర్మాత దిల్ రాజుతో కలిసి 'శ్రీనివాస కళ్యాణం' అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను చేస్తున్నారు.  చివరి దశ పనుల్లో ఉన్న ఈ సినిమా ఆగష్టు 9న విడుదలకానుంది.  గతేడాది ఆరంభంలో ఇండస్ట్రీకి 'శతమానం భవతి' రూపంలో మంచి విజయాన్ని అందించిన దర్శకుడు సతీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటంతో ప్రేక్షకుల్లో కూడా సినిమాపై మంచి నమ్మకాలే ఉన్నాయి.  మరి ఈ కళ్యాణం అయినా నితిన్ ఫేట్ ను మారుస్తుందో లేదో చూడాలి.