ఇంకో టాలెంటెడ్ దర్శకుడ్ని పట్టిన నితిన్ !

ఇంకో టాలెంటెడ్ దర్శకుడ్ని పట్టిన నితిన్ !

వరుస పరాజయాలతో ఇబ్బందిపడుతున్న నితిన్ ప్రస్తుతం 'ఛలో' దర్శకుడు వెంకీ కుడుములతో ఒక సినిమాను ఒప్పుకున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా ఇంకొన్ని రోజుల్లో పట్టాలెక్కనుంది.  సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. 

వెంకీ కుడుముల కాకుండా నితిన్ ఇంకొక టాలెంటెడ్ డైరెక్టర్ని కూడ పట్టుకున్నాడు.  అతనే చంద్రశేఖర్ ఏలేటి.  మొదటి నుండి భిన్నమైన సినిమాలు చేసే ఏలేటి నితిన్ కోసం కూడ ఒక కొత్త లైన్ సిద్ధం చేశారట.  త్వరలోనే వీరి సినిమా కూడ మొదలవుతుందని, దీన్ని భవ్య క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుందని తెలుస్తోంది.