ఉన్నట్టుండి నితిన్ కు పెళ్లి పై మనసు మళ్లింది !

ఉన్నట్టుండి నితిన్ కు పెళ్లి  పై మనసు మళ్లింది !

టాలీవుడ్లో ఉన్న హీరోల్లో పెళ్లి వయసొచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారులుగానే కొనసాగుతున్న హీరోలు కొంతమంది ఉన్నారు.  అలాంటి వాళ్లలో నితిన్ కూడ ఒకరు.  ఇప్పటికే 34 ఏళ్ల వయసు నిండినా నితిన్ మాత్రం ఎప్పుడు పెళ్లి మాటెత్తినా ఏదో ఒక మాట చెప్పి విషయాన్ని దాటేస్తూ ఉంటారు. 

అలాంటి ఆయనకు ఉన్నట్టుండి పెళ్లిపై మనసు మళ్లింది.  అందుకు కారణం ఆయన తాజాగా చేసిన 'శ్రీనివాస కళ్యాణం' సినిమా అట.  ఈ సినిమా గురించి నితిన్ మాట్లాడుతూ ఎప్పుడూ ఇంట్లో అమ్మ పెళ్లి పెళ్లి అని గొడవ పెట్టేది.  ఎప్పుడైతే సతీష్ వేగేశ్న నా దగ్గరకొచ్చి ఈ సినిమా కథ చెప్పాడో అప్పుడే పెళ్లిపై నా అభిప్రాయం మారింది.  అమ్మతో పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పాను అన్నారు.  మరి ఇన్నాళ్లకు మనసు మార్చుకున్న నితిన్ కు వివాహ యోగం ఎప్పుడో చూడాలి.