నితిన్ సినిమా.. మూడు భాగాలు !

నితిన్ సినిమా.. మూడు భాగాలు !

హీరో నితిన్ తన కొత్త సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.  కృష్ణ చైతన్య ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు.  తన కెరీర్లోనే ప్రతిష్టాత్మక చిత్రమంటూ నితిన్ ప్రకటన చేయడంతో అందరిలోనూ ప్రాజెక్ట్ పట్ల ఆసక్తి నెలకొంది.  తాజా సమాచారం మేరకు ఈ సినిమా మొత్తం మూడు భాగాలుగా ఉంటుందని తెలుస్తోంది.  అయితే నితిన్ నుండి మాత్రం ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు.  తన సొంత బ్యానర్ శ్రేష్ట్ బ్యానర్ పై  నితిన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.   ఈ ఏడాది మొదలుకానున్న సినిమా 2020 వేసవికి విడుదలకానుంది.  గతంలో నితిన్, కృష్ణ చైతన్యలు కలిసి 'ఛల్ మోహన్ రంగ' అనే సినిమాకు పనిచేశారు.