'రష్మిక . కుక్క బిస్కెట్లు'... నితిన్ షాకింగ్ కామెంట్

'రష్మిక . కుక్క బిస్కెట్లు'... నితిన్ షాకింగ్ కామెంట్

యంగ్ హీరో నితిన్, ముద్దుగుమ్మ రష్మిక మందన కలిసి నటిస్తున్న సినిమా 'భీష్మ'.ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఛలో ఫేమ్ వెంకి కుడుముల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నడు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీ గా ఉన్నారు హీరో హీరోయిన్. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో రష్మిక పై ఆసక్తికర కామెంట్ చేసాడు హీరో నితిన్. 

'మాములుగా మనం ఆకలేస్తే చిప్స్, సమోసాలు, చాక్లెట్లు వాగేరా తింటాం.. కానీ రష్మికకు ఆకలి వేస్తే  కుక్క బిస్కెట్లు తింటుందని' అన్నాడు. మరి ఇది నిజంగా జరిగిందా..?  లేక తమాషా కోసం నితిన్ అలా అన్నాడా..? లేక ఇది సినిమాలో సీన్ కు సంబంధించిందా.. ? అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాతో నితిన్ పక్కా హిట్ కొట్టేలా ఉన్నాడు.చూడాలి మరి ఎం జరుగుతుందో.