5 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యం

5 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతీ ఆయోగ్ సమావేశం ప్రారంభమైంది. నీతీ ఆయోగ్ ఐదో సమావేశంలో ప్రధానమంత్రి మోడీ 2024 నాటికి భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లు చేయాలనే లక్ష్యం నిర్ణయించారు. ఇది సవాలుతో కూడుకున్నదే అయినప్పటికీ సాధ్యం చేయవచ్చని ఆయన చెప్పారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ మంత్రాన్ని పూర్తి చేయడంలో నీతీ ఆయోగ్ కి కీలక పాత్ర అని ప్రధాని అన్నారు. ఆదాయం, ఉపాధి పెంచడంలో ఎగుమతి రంగం ప్రధానమని, రాష్ట్రాలను ఎగుమతులకు ప్రోత్సహించడంలో దృష్టి పెట్టాలని సూచించారు. 

నీతీ ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ ఆరంభ సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని మోడీ 2024 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లు అంటే రూ.34,94,00,00 కోట్లకు చేర్చడాన్ని లక్ష్యంగా పెట్టారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ లక్ష్యం సవాళ్లతో కూడుకున్నదైనా రాష్ట్ర ప్రభుత్వాలు శ్రమిస్తే సాధించవచ్చని మోడీ అన్నారు. రాష్ట్రాలు తమ ఆర్థిక సామర్థ్యాన్ని గుర్తించాలని, జీడీపీ లక్ష్యం పెంచడంపై కృషి చేయాలని చెప్పారు. ఇందుకోసం జిల్లా స్థాయిలో పని చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.
Hit link ot see the pic: https://twitter.com/NITIAayog/status/1139846469492494338
మనం ఇప్పుడు పెర్ఫామెన్స్, ట్రాన్స్ పరెన్సీ, డెలీవరీ అనే ప్రత్యేక లక్షణాలు ఉన్న గవర్నెన్స్ సిస్టమ్ దిశగా వెళ్తున్నామని ప్రధాని మోడీ అన్నారు. పథకాలను క్షేత్ర స్థాయిలో సరిగా అమలు చేయడం తప్పనిసరని సూచించారు. ప్రజల విశ్వాసాన్ని చూరగొనే విధంగా పనిచేసే ప్రభుత్వ వ్యవస్థను తయారు చేయాల్సిందిగా గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులకు ఆయన విజ్ఞప్తి చేశారు.
Hit link to see the Pic: https://twitter.com/PIB_India/status/1139845772713680896
ఈ సారి ఏర్పాటు చేసిన జల శక్తి మంత్రిత్వశాఖ నీటిని సంపూర్ణంగా ఉపయోగించేందుకు ప్రత్యేక దృష్టి పెడుతుందని తెలిపారు. రాష్ట్రాలు కూడా నీటి సంరక్షణ, నీటి నిర్వహణ కోసం చేస్తున్న అనేక ప్రయత్నాలను ఒక వేదికపైకి తీసుకు రావాలని ప్రధాని రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. లభ్యమవుతున్న నీటిని జాగ్రత్త చేసుకోవడం అత్యంత ఆవశ్యకమని చెప్పారు. 2024 నాటికి దేశంలోని ప్రతి గ్రామీణ ప్రాంత ఇంటికి పైప్ ద్వారా సురక్షిత నీటిని అందించడం తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. 

మావోయిస్ట్ హింసకు వ్యతిరేకంగా యుద్ధం నిర్ణాయక దశకు చేరుకుందని మోడీ అన్నారు. హింసకు గట్టిగా జవాబు ఇస్తామని స్పష్టం చేశారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఇప్పటికీ అమలు చేయని రాష్ట్రాలు ఈ వ్యవహారంలో వీలైనంత త్వరగా కేంద్ర ప్రభుత్వం కలిసి రావాలని ప్రధాని అప్పీల్ చేశారు. ఆరోగ్యం, ప్రజా సంక్షేమం ప్రతి నిర్ణయానికి కేంద్ర బిందువుగా ఉండాలని ఆయన సూచించారు.